CM KCR : సీఎం కేసీఆర్ ఆల్ ఈజ్ వెల్.. పరీక్షలన్నీ నార్మల్
పరీక్షలన్నీ నార్మల్ గా రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ గదిలో కాసేపు సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు...

Kcr Yashoda
CM KCR Health Latest Update : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని యశోద వైద్యులు వెల్లడించారు. నిర్వహించిన ఆరోగ్య పరీక్షల రిపోర్టుల్లో నార్మల్ గా ఉందని, రిపోర్టులు అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు వైద్యులు. సీఎం కేసీఆర్ కు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. 2022, మార్చి 11వ తేదీ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ను ఎప్పుడూ పరీక్షించే ప్రముఖ వైద్యులు ఎం.వి. రావు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. అందులో నార్మల్ గా ఉన్నట్లు వచ్చింది.
Read More : Telangana : సీఎం కేసీఆర్ హెల్త్ అప్ డేట్.. నిలకడగానే ఆరోగ్యం
అనంతరం సిటీ, ఎంఆర్ఐ స్కాన్, రక్త పరీక్షలు, కిడ్నీ టెస్టు ఇతరత్రా వైద్య పరీక్షలు చేశారు. అన్నీ పరీక్షల్లోనూ నార్మల్ గా వచ్చినట్లు తేలింది. ఆయన అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తెలుసుకున్న కేసీఆర్ అభిమానులు, కుటుంబసభ్యులు టెన్షన్ కు గురయ్యారు. ఆయనకు ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. యశోదా ఆసుపత్రికి కేసీఆర్ వెంట సతీమణి శోభ, కూతురు కవిత, మనువడు, ఎంపీ సంతోష్ కుమార్ లున్నారు. సమాచారం తెలుసుకున్న కుమారుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యశోదా ఆసుపత్రికి వచ్చారు.
Read More : CM KCR: రెండ్రోజులుగా వీక్‌గా ఉన్న కేసీఆర్.. యశోదా డాక్టర్ ఎంవీ రావు ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరీక్షలన్నీ నార్మల్ గా రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ గదిలో దాదాపు మూడు గంటల పాటు ఉండనున్నారు. వైద్యులు అన్నీ అజ్జర్వేషన్స్ చేసిన తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. వాస్తవానికి శుక్రవారం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించి… ఆలయ పునర్ ప్రారంభోత్సవం తదితర వాటిపై అధికారులు, ఆలయ అర్చకులతో చర్చించాల్సి ఉంది.