South Korean Airspace : దక్షిణ కొరియా గగనతలంలో చైనా, రష్యా యుద్ధ విమానాలు

దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

South Korean Airspace : దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరు రష్యా, రెండు చైనా యుద్ధ విమానాలు దక్షిణ కొరియా భూభాగంలోని గగనతలంలోకి ప్రవేశించాయి.

North Korea: దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు.. ఉత్తర కొరియా హెచ్చరిక

ఇదే విషయాన్ని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. చైనా హెచ్6 బాంబర్లు ఉదయం 5.50 గంటల సమయంలో దక్షిణ-ఈశాన్య తీరాల నుంచి ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి ప్రవేశించిన కొద్ది సేపటికి నిష్క్రమించాయని పేర్కొన్నారు. వీటిలో టీయూ-95 బాంబర్, ఎస్ యూ-35 ఫైటర్ జెట్ తో సహా రష్యా యుద్ధ విమానాలు ఉన్నాయని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు