North Korea: దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు.. ఉత్తర కొరియా హెచ్చరిక

తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది. ప్రస్తుతం దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ సంయుక్త విన్యాసాలు శుక్రవారం వరకు కొనసాగనున్నాయి. కొన్ని వారాలుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు కూడా చేపట్టనుందని నిఘా వర్గాలు తమ నివేదికల్లో తెలిపాయి.

North Korea: దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు.. ఉత్తర కొరియా హెచ్చరిక

South Korea

North Korea: తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరించింది. ప్రస్తుతం దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ సంయుక్త విన్యాసాలు శుక్రవారం వరకు కొనసాగనున్నాయి. కొన్ని వారాలుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు కూడా చేపట్టనుందని నిఘా వర్గాలు తమ నివేదికల్లో తెలిపాయి. 2017 తర్వాత ఉత్తర కొరియా తొలిసారి చేపట్టనున్న అణ్వస్త్ర పరీక్ష ఇది.

ఈ నేపథ్యంలోనే అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అమెరికా తమ దేశ భద్రతాపర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏవైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని భావిస్తుందా? అనవసర, ప్రయోజనం లేని యుద్ధ విన్యాసాలను ఆపేయాలి. లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది’’ అని అందులో ఉత్తర కొరియా హెచ్చరించింది.

కాగా, వందలాది యుద్ధ విమానాలతో అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు చేపడుతున్నాయి. ఇప్పటికే అమెరికా అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగాన్ ను కొరియా ద్వీపకల్పానికి సమపంలో మోహరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..