ఆడ‌వాళ్లా..మాయ లేడీలా

షాపింగ్ అంటూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వ‌చ్చారు. ధ‌న‌వంతుల్లా ఫోజిచ్చారు. మెము వెరీ రిచ్ అని బిల్డ‌ప్ కొట్టారు. అన్ని వ‌స్తువులు కొనేవారిలా అన్ని తీయించి చూశారు.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 05:49 AM IST
ఆడ‌వాళ్లా..మాయ లేడీలా

Updated On : December 29, 2018 / 5:49 AM IST

షాపింగ్ అంటూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వ‌చ్చారు. ధ‌న‌వంతుల్లా ఫోజిచ్చారు. మెము వెరీ రిచ్ అని బిల్డ‌ప్ కొట్టారు. అన్ని వ‌స్తువులు కొనేవారిలా అన్ని తీయించి చూశారు.

షాపింగ్ అంటూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వ‌చ్చారు. ధ‌న‌వంతుల్లా ఫోజిచ్చారు. మెము వెరీ రిచ్ అని బిల్డ‌ప్ కొట్టారు. అన్ని వ‌స్తువులు కొనేవారిలా అన్ని తీయించి చూశారు. తర్వాత దొంగ బుద్దిని చూపించారు. చినవాల్తేరు మసీదు రోడ్డులో లతీష్‌ కృష్ణ ఫ్యాషన్‌ జువెలరీ షాపులో ఈ సంఘటన జరిగింది. 2018, డిసెంబర్ 27 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు మహిళలు షాప్‌కు వచ్చారు. షాపింగ్‌ చేస్తూనే మరో ఇద్దరికి ఫోన్‌ చేసి రప్పించారు. నలుగురూ షాపింగ్‌ చేస్తున్నట్టు నమ్మించారు. మెల్లగా వన్‌ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను కొట్టేశారు. షాపు యజమాని ఆయన భార్య ప‌నివాళ్లు ఉన్నారు.
బండారం బయటపడింది ఇలా:
రాత్రి షాపు మూసే సమయంలో యజమాని సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశాడు. ఆ సమయంలో చోరీ విషయం బటయపడింది. నలుగురు మహిళలు నెక్లెస్‌లు, చైన్లు వంటి వన్‌గ్రామ్ గోల్డు ఆభరణాలు చోరీ చేసినట్టు రికార్డు అయింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ అయిన వాటి విలువ రూ.40వేలు ఉంటుందని చెప్పాడు.