Fake Reporter Arrested : పోలీసులు,విలేకరులమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

పోలీసులుగా, రిపోర్టర్లుగా చెలామణి అవుతూ ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Reporter And Police

Fake Reporter Arrested :  పోలీసులుగా, రిపోర్టర్లుగా చెలామణి అవుతూ ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్‌లో  వీరిద్దరూ SOT పోలీసులమని,  విలేకరులమని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.

నెలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితులు… చివరికి నెలకు 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.  అనుమానం వచ్చిన మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం డబ్బులు తీసుకోవటానికి వచ్చిన నిందితులిద్దరినీ పోలీసులకు పట్టుకున్నారు.

Also Read : Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు

నిందితులను మోడెజబా మనిక్ (32),కొత్తగాడి అమర్నాథ్ (33) గా గుర్తించారు. నిందితులిద్దరూ గతంలో ఒక న్యూస్ ఛానల్ లోనూ… పేపర్ లోనూ పని చేసినట్లు తెలిసింది.  వారి వద్దనుంచి ఒక ద్విచక్ర వాహనం,2 మొబైల్ ఫోన్స్, 2 నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకుని కేసు తదుపరి  విచారణ నిమిత్తం మియాపూర్ పోలీసులకు అప్పగించారు. మియపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.