Brothel House : వ్యభిచార గృహం పై దాడి.. విటుడు, ఇద్దరు మహిళలు అరెస్ట్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు.

Brothal House Arrested
Brothel House : రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచార గృహం నడుపుతున్నారనే సమాచారంతో 1టౌన్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు మహిళలతో సహా విటుడిని అరెస్ట్ చేశారు. మరోక వ్యక్తి పరారయ్యాడు.
పెండ్యాల నాగలక్ష్మి అనే మహిళ కల్లోయ దినేష్ అనే వ్యక్తితో కలిసి వ్యభిచార గృహం నడుపుతోంది. ఇతర ప్రాంతాలనుంచి యువతులను రప్పించి విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడి చేయటంతో నిర్వాహకుడు దినేష్ పరారయ్యాడు. నిర్వాహకురాలు నాగలక్ష్మి బాధితురాలైన యువతి, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను స్వధార్ హోమ్ కు తరలించారు. నిర్వాహకురాలు నాగలక్ష్మి ,విటుడిని రిమాండ్ కు పంపారు.