Odisha Train Accident: స్పృహలో ఉన్నకోరమండల్ డ్రైవర్.. కోలుకుంటున్న గూడ్స్ రైలు గార్డు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత కోరమాండల్ డ్రైవర్, గూడ్స్ రైలు గార్డు సజీవంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొన్న గూడ్స్‌ రైలు గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత కోరమాండల్ డ్రైవర్, గూడ్స్ రైలు గార్డు సజీవంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొన్న గూడ్స్‌ రైలు గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.(Goods train guard alive)కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ జిఎన్ మొహంతి, అసిస్టెంట్ లోకో పైలట్‌ హజారీ బెహెరాకు తీవ్ర గాయాలయ్యాయి.‘‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ ప్రమాదం తర్వాత స్పృహలో ఉన్నాడు,(Coromandel driver was conscious) అతను గ్రీన్ సిగ్నల్ పొందినట్లు ధృవీకరించే స్థితిలో ఉన్నాడు’’ అని రైల్వే బోర్డు ధృవీకరించింది.

Small Plane Crashed: జెట్ ఫైటర్‌ను వెంటాడి వర్జీనియాలో కుప్పకూలిన చిన్న విమానం

రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా కోరమండల్ డ్రైవర్‌తో తాను జరిపిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. వెనుక నుంచి తనకు అసాధారణ శబ్ధం వినిపించిందని, ఎదో ఆటంకం వచ్చిందని భావించినట్లు టీటీఈ జయవర్మ చెప్పారు.కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్స్‌ రైలు ప్రమాద సమయంలో గార్డు క్యారేజ్‌లో లేరని, రైల్వే నిబంధనల ప్రకారం గూడ్స్ రైలు గార్డు, డ్రైవర్ రైలు ఎక్కడైనా ఆపి ఉంచినప్పుడు దాని భద్రతను నిర్ధారిస్తారని వర్మ పేర్కొన్నారు.

Petrol at Rs 200: ఆ రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ ధర రూ.200..ఎందుకంటే…

గూడ్స్ రైలు పార్క్ చేసిన లూప్ లైన్‌లో కోరమండల్ వచ్చేలా చేసిన సిగ్నలింగ్ గురించి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో రైల్వే బోర్డు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. రైలు స్పీడ్ లిమిట్‌లో ఉందని, సిగ్నల్ జంప్ చేయలేదని రైల్వే బోర్డు అధికారులు ధృవీకరించారు.

 

ట్రెండింగ్ వార్తలు