Small Plane Crashed: వర్జీనియాలో కుప్పకూలిన చిన్న విమానం

అమెరికా దేశంలోని వర్జీనియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ ప్రాంతంలో చిన్న విమానం జెట్ ఫైటర్ ను ఛేజింగ్ చేసి వర్జీనియాలో కూలిపోయింది.

Small Plane Crashed: వర్జీనియాలో కుప్పకూలిన చిన్న విమానం

Small Plane Crashed

Small Plane Crashed: అమెరికా దేశంలోని వర్జీనియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ ప్రాంతంలో చిన్న విమానం నిబంధనలకు విరుద్ధంగా గగనతలంలోకి రావడంతో  జెట్ ఫైటర్ ఛేజింగ్ చేసింది. దీంతో  చిన్న విమానం వర్జీనియాలో కూలిపోయింది. వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో గగనతలాన్ని ఉల్లంఘించిన విమానం వర్జీనియా పర్వతాలపై కూలిపోయిందని యునైటెడ్ స్టేట్స్ అధికారులు చెప్పారు.(crashes in Virginia) విమానాన్ని జెట్ ఫైటర్ ఛేజింగ్ చేయడం వాషింగ్టన్(Washington area) ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Jet fighters chase small plane)

Petrol at Rs 200: ఆ రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ ధర రూ.200..ఎందుకంటే…

సెస్నా ఫ్లోరిడాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎంకోర్ మోటార్స్‌ పేరిట ఈ విమానం రిజిస్టర్ చేసి ఉంది. ఎన్‌కోర్ యజమాని జాన్ రంపెల్ తన కుమార్తె, మనవడు, ఆమె నానీ విమానంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వర్జీనియాలోని జార్జ్ వాషింగ్టన్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలో సెస్నా విమానం కూలిపోయే వరకు పైలట్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి యూఎస్ మిలిటరీ ప్రయత్నించిందని ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తెలిపింది.జెట్ ఫైటర్ల వల్ల ఈ ప్రమాదం జరగలేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.వర్జీనియా రాష్ట్ర పోలీసులు కూలిన విమానం శిథిలాల కోసం వెతుకుతున్నారని, అయితే ఇంకా వాటిని కనుగొనలేదని చెప్పారు.