లక్షకు పైగా ఆధార్ వివరాలను లీక్ చేసిన ఇండేన్ గ్యాస్

లక్షకు పైగా ఆధార్ వివరాలను లీక్ చేసిన ఇండేన్ గ్యాస్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఉత్పత్తులలో ఒకటైన ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ల ఆధార్ డేటాను మిలియన్ సంఖ్యలో లీక్ అయ్యేందుకు కారణమైందట. ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ బాప్టిస్ రోబర్ట్ ఈ విషయాన్ని కనుగొన్నాడు. 6.7 మిలియన్ డీలర్లు ఒకే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పాడు. అంతమంది ఒకే డేటాతో లాగిన్ అవుతుండటంతో ఎవరో ఒకరు దానిని దుర్వినియోగం చేసి ఉంటారని భావిస్తున్నారు. 

ఈ ఘటనపై సెక్యూరిటీ రీసెర్చర్ ఇలా మాట్లాడారు. ‘నేను పైథాన్ స్క్రిప్ట్ రాస్తుండగా ఇండేన్ యూజర్ల ఐడీలు ఒకేలా ఉండటం గమనించా. వాటిలో 11,602 వాలిడ్ ఐడీలు మాత్రమే ఉన్నాయి. మొత్తం ఎఫెక్ట్ అయిన 5,826,116 డీలర్లలో ఒక రోజుకి 9,490 డీలర్లను మాత్రమే పరీక్షించా. అందులో ఇండేన్ కస్టమర్ల డేటా లీక్ అయిందని స్ఫష్టమవుతోంది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు… ఇండేన్ నా ఐపీ అడ్రస్‌నే బ్లాక్ చేసింది. దాంతో మిగిలిన 1,572 మంది డీలర్ల డేటా భద్రంగా ఉందో లేదో తెలుసుకోలేకపోయా. అంతేకాకుండా 6,791,200 మంది వరకూ లీక్ అయిన డేటా ఉండొచ్చు’

డీలర్ల దగ్గర నుంచి డేటా చోరీ చేసి కస్టమర్ల పేర్లు, ఆధార్ నెంబర్లు, వారి వ్యక్తిగత వివరాలు, చిరునామాలను వేరే దారులలో వాడే అవకాశాలు లేకపోలేదు. గ్రామానికొకటిగా కేటాయించిన ఇండేన్ గ్యాస్ కంపెనీ బ్రాంచిలు ఒకే ఐడీ వాడడం అధికారుల నిర్లక్ష్యాన్ని చూపెడుతోంది. ప్రతి వివరాలకు ఆధార్ తప్పనిసరి అయిపోవడం, అడిగిన వెంటనే కస్టమర్లు ఇచ్చేయడంతో దానిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు యజమానులు.