Whatsapp DP Blackmail : మీ భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా? అయితే బీకేర్ ఫుల్

మీ భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే అలవాటు మీకుందా? డీపీ చాలా బాగుందని చూసినోళ్లు చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంట్లు చూసి సంబర పడిపోతున్నారా?

Whatsapp

Whatsapp DP Blackmail : మీ భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే అలవాటు మీకుందా? డీపీ చాలా బాగుందని చూసినోళ్లు చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కాంప్లిమెంట్లు చూసి సంబర పడిపోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. అలాంటి ఫొటోలను డీపీగా పెట్టే ముందు జాగ్రత్తపడాల్సిందే. లేదంటే దారుణాలు జరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.

ఎందుకంటే.. వాట్సాప్ డీపీగా తన భార్యతో దిగిన ఫొటోను పెట్టుకున్న వ్యక్తికి సైబర్ క్రిమినల్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు దిగారు. ఏకంగా అతడి నుంచి లక్ష రూపాయలకు పైగా డబ్బు గుంజారు. అయినా ఇంకా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ చిలకలగూడలో ఈ దారుణం జరిగింది.

Marriage Cheating : మ్యాట్రిమోనీ లో పరిచయం.. కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి

సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోయాయి. కొత్త పద్ధతుల్లో అమాయకులను చీట్ చేస్తున్నారు. వారి నుంచి డబ్బు దండుకుంటున్నారు. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దిగిన ఫొటోను అందరిలానే వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. అంతే.. సైబర్ నేరగాళ్ల చేతికి అడ్డంగా చిక్కాడు.

వాట్సాప్ డీపీ నుంచి ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకున్న సైబర్ కేటుగాళ్లు అందులోని భార్య ఫొటోను మార్ఫింగ్ చేశారు. న్యూడ్ ఫొటోగా మార్చారు. ఆ తర్వాత దాన్ని భర్త ఫోన్‌కు పంపారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఈ ఫొటోలు పంపిస్తామని ఆ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేశారు. ఊహించని ఘటనతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. తన పరువు పోతుందని భయపడ్డాడు. మరో దారి లేక వారికి డబ్బు పంపాడు. అలా రెండు దఫాల్లో రూ.1.2 లక్షలను సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేశాడు.

డబ్బు పంపినా కేటుగాళ్ల వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బు పంపాలని డిమాండ్ చేశారు. వారి వేధింపులు భరించలేకపోయిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Minor Girl Raped : దారుణం! బాలికపై ఆరుగురు మైనర్ అబ్బాయిల అత్యాచారం.. మూడు నెలలుగా..!

కాగా, ఇది తెలిసిన వాళ్ల పనే కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అదే సమయంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో ప్రొఫైల్‌ పిక్స్ లో, డీపీల్లో మహిళల ఫొటోలు పెట్టేవారిని హెచ్చరించారు. ఆ విధంగా మహిళల ఫొటోలు పెట్టకపోవటమే సేఫ్ అని సూచిస్తున్నారు. అలాగే తెలియని వారితో చాటింగ్‌లు, ఫోన్ లో మాట్లాడటం చేయొద్దన్నారు. అనుమానిత నెంబర్లను బ్లాక్‌ చేయాలని చెప్పారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదిఏమైనా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండటం అవసరమని పోలీసులు స్పష్టం చేశారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కొంతమందికి ప్రతీది సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఫొటోలు సహా వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికొచ్చే కాంప్లిమెంట్స్ చూసి మురిసిపోతుంటారు. అయితే, ఇలాంటి వాటి వల్ల కలిగే ఆనందం సంగతి ఏమో కానీ, చాలా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. మిమ్మల్ని రహస్యంగా మరో వ్యక్తి ఫాలో అవుతున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని పోలీసులు హెచ్చరించారు.