Dalit IIT Student: ఐఐటీ బాంబేలో మరో రోహిత్ వేముల.. కుల వివక్ష దాడి భరించలేక విద్యార్థి ఆత్మహత్య

దర్శన్ ఆంటీ దివ్యాబెన్ స్పందిస్తూ ‘‘నెల రోజుల క్రితం దర్శన్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రీగా చదువుకుంటున్నావని స్నేహితులు హేళన చేసేవారని చెప్పాడు. దర్శన్ మీద వాళ్లు చాలా కోపంతో, అసూయతో ఉండేవారట. తాము చాలా డబ్బు ఖర్చు చేసి చదువుతుంటే దర్శన్ మాత్రం ఉచితంగా చదువుతున్నాడని ప్రతిసారి అసూయను చూపించేవారట. ఈ మాటలు చెప్తూ దర్శన్ చాలా ఏడ్చేవాడు’’ అని చెప్పారు. దర్శన్ ఆత్మహత్యకు రెండు గంటల ముందు తనతో ఫోన్ మాట్లాడినప్పుడు బాగానే ఉన్నట్లు అతడి తండ్రి తెలిపాడు.

Dalit IIT Student: ఐఐటీ బాంబేలో మరో రోహిత్ వేముల.. కుల వివక్ష దాడి భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Dalit IIT Student, Who Died By Suicide, Was Humiliated By Friends

Dalit IIT Student: కొంత కాలం క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మరణం దేశాన్ని కుదిపి వేసింది. యూనివర్సిటీ క్యాంపస్‭లో కుల వివక్ష దాడి భరించలేక రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం భగ్గున లేచింది. ఇది గడిచి ఏడేళ్లైనప్పటికీ, ఇంకా పచ్చిగానే తాకుతుంటుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి కుల వివక్ష దాడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించగా, యూనివర్సిటీ మాత్రం కొట్టి పారేసింది. అయితే దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.

Elon Musk : ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన ఎలాన్ మస్క్

యూనివర్సిటీలో దర్శన్ ఎదుర్కొన్న కుల వివక్షపై అతడి సోదరి జాన్వి సోలంకి స్పందిస్తూ ‘‘పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మారిపోయిందట. దర్శన్‭తో కలిసి బయటికి వెళ్లేవారే కాదట. దీంతో చాలా డీప్ డిప్రెషన్లోకి దర్శన్ వెళ్లిపోయారు. తనని చూసినప్పుడు అలాగే కనిపించేవాడు. చివరికి అది ఆత్మహత్యకు దారితీసింది’’ అని పేర్కొంది.

KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్

దర్శన్ ఆంటీ దివ్యాబెన్ స్పందిస్తూ ‘‘నెల రోజుల క్రితం దర్శన్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రీగా చదువుకుంటున్నావని స్నేహితులు హేళన చేసేవారని చెప్పాడు. దర్శన్ మీద వాళ్లు చాలా కోపంతో, అసూయతో ఉండేవారట. తాము చాలా డబ్బు ఖర్చు చేసి చదువుతుంటే దర్శన్ మాత్రం ఉచితంగా చదువుతున్నాడని ప్రతిసారి అసూయను చూపించేవారట. ఈ మాటలు చెప్తూ దర్శన్ చాలా ఏడ్చేవాడు’’ అని చెప్పారు. దర్శన్ ఆత్మహత్యకు రెండు గంటల ముందు తనతో ఫోన్ మాట్లాడినప్పుడు బాగానే ఉన్నట్లు అతడి తండ్రి తెలిపాడు.

Yogi Adityanath: ప్రధానమంత్రి పదవిపై యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డబ్బులైమైనా కావాలని అడిగితే తన దగ్గర ఉన్నాయని చెప్పాడట, అయినప్పటికీ తాను కొంత డబ్బు పంపానని దర్శన్ తండ్రి చెప్పాడు. తాను బయటికి వెళ్తున్నట్లు చెప్పాడని, వాస్తవానికి దర్శన్ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడని, అయినా తాను అప్పుడప్పుడు పంపుతూ ఉంటానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బహుజన సంఘ విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే యూనివర్సిటీ పరిధిలో కుల వివక్ష లాంటి ఘటనలను యాజమాన్యం తోసిపుచ్చింది. దర్శన్ ఆత్మహత్యపై విచారణ చేపట్టినట్లు పేర్కొంది.