KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్

బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీసిన డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్లాలి.

KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్

KA Paul: గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఆ సంస్థపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. బుధవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీసిన డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్లాలి. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అంతర్జాతీయ మీడియాతో మోదీ యుద్ధం చేయొద్దు. మోదీ, అమిత్ షా, విదేశాంగ శాఖ అంతర్జాతీయ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాలు చేయొద్దు. ఇది దేశానికి ప్రమాదకరం.

Andhra pradesh Politics: కాపుల చుట్టే ఏపీ రాజకీయం..‘కమలం రంగా జపం’..! జీవీఎల్ ఒకవైపు.. కన్నా మరోవైపు..మధ్యలో ఏపీ మ్యాప్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అతి త్వరలో కవితను అరెస్టు చేస్తారు. కేసీఆర్ దేశ్ కీ నేత అయినంత మాత్రాన కవితను అరెస్టు చేయకుండా ఉండరు. కేసీఆర్ దేశ్ కీ నేత కాదు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన ముఖ్యమంత్రులకు కేసీఆర్ డబ్బులిచ్చి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న సీఎంలు, నేతలు అంతా బానిసలు. తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని మరో మూడు రోజుల్లోగా ప్రకటించకపోతే ఫిబ్రవరి 17న తెలంగాణవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ మద్దతుదారులు ఆందోళనలు చేయాలి.

నేను ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతా. దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలేవీ అమలు పర్చలేదు. ఏప్రిల్ 14నే తెలంగాణలోని అంబేద్కర్ సచివాలయం ప్రారంభించాలి’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.