దీప్తిశ్రీ హత్య కేసు : మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు
కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
కాకినాడలో ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. శాంతికుమారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దీప్తిశ్రీ మృతదేహం కోసం సంజయ్‌నగర్ డంపింగ్ యార్డులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అటు ఇంద్రపాలెం దగ్గరున్న ఉప్పుటేరులోనూ బాలిక మృతదేహాన్ని పడేసి ఉండొచ్చన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. నాలుగు బోట్లతో ఉప్పుటేరులో ధర్మాడి బృందం గాలిస్తోంది.
దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనే సంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు దగ్గర దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
జగన్నాథపురంలో చిన్నారి చదువుతున్న స్కూల్ ఆవరణలో కిడ్నాప్‌కు గురైంది. శుక్రవారం(నవంబర్ 22,2019) మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న దీప్తిశ్రీని సవతి తల్లి తీసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తల్లి తీసుకెళ్లడంతో తాము ఏమీ అడగలేకపోయామని అంటున్నారు. ఆ తర్వాత చిన్నారి కనిపించడం లేదని తండ్రి తమ దగ్గరకు వచ్చారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.
కాకినాడ నగరానికి చెందిన సత్యశ్యామ్ ప్రసాద్ కుమార్తె దీప్తిశ్రీ(7) స్థానిక జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. శ్యామ్ ప్రసాద్ మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య శాంతకుమారి, కుమారుడితో కలిసి సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దీప్తిశ్రీ తూరంగిలోని పగడాల పేటలో మేనత్త దగ్గర ఉంటోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారిని.. మధ్యాహ్న భోజన సమయంలో బడి ఆవరణలో ఆడుకుంటుండగా శాంతికుమారి కిడ్నాప్ చేసింది.