Delhi Gym Trainer : కొన్ని గంటల్లో పెళ్లి, ఇంతలోనే ఘోరం.. పెళ్లి కొడుకు దారుణ హత్య
ఈ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Delhi Gym Trainer
Delhi Gym Trainer : కొన్ని గంటల్లో అతడి పెళ్లి.. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. బంధుమిత్రులు కూడా వచ్చేశారు. అక్కడ అంతా పెళ్లి సందడే కనిపిస్తోంది. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. పెళ్లి కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుడు.. 15సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం సౌత్ ఢిల్లీలో చోటు చేసుకుంది.
మృతుడి పేరు గౌరవ్ సింఘాల్. జిమ్ ట్రైనర్. వయసు 29ఏళ్లు. కొన్ని గంటల్లో అతడి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే అతడు దారుణంగా చంపబడ్డాడు. అతడి ముఖం, ఛాతిపైన కత్తిగాట్లు ఉన్నాయి. 15సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు దుండగుడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కనిపించకుండా పోయిన మృతుడి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మృతుడి తండ్రి ప్రధాన నిందితుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. మృతుడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
జిమ్ ట్రైనర్ ను ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? కారణం ఏంటి? అనేది మిస్టరీగా మారింది. త్వరలోనే మర్డర్ వెనుక మిస్టరీని చేధిస్తామని పోలీసులు తెలిపారు. అయితే, మృతుడికి అతడి తండ్రికి మధ్య వివాదం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న మృతుడి తండ్రిని అదుపులోకి తీసుకుంటే అసలేం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న గౌరవ్ సింఘాల్ ను బంధువులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు హత్యకు గురికావడం సంచలనంగా మారింది. పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. కాసేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావు డప్పులు వినిపించాయి. పెళ్లి కొడుకు హత్యతో బంధువులు షాక్ కి గురయ్యారు. అయితే ఈ మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసుని దర్యాఫ్తు చేస్తున్నారు. చిన్న క్లూ కూడా చిక్కకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.
Also Read : నిజాంపేట ఘటన మరకముందే.. ఇళ్లలోకి చొరబడిన ముగ్గురు దుండగులు