delhi liquor scam
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ED (Enforcement Directorate)అధికారులు గురుగావ్ కుచెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ..మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో అదుపులోకి తీసుకున్న్ అమిత్ అరోరాను బుధవారం (నవంబర్ 30,11,2022) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు.
బడ్డీ రిటైల్ ప్రైవేట్ సంస్థ యజమానిగా ఉన్న అమిత్ ఆరోరా ఢిల్లీ లిక్కర్ స్కాంలో లిక్కర్ కంపెనీల నుంచి ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలతో అరెస్టు చేశారు. సీబీఐ, ఆడీ ఎఫ్ఐఆర్‌లలో 9వ నిందితుడిగా అమిత్ ఆరోరా ఉన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.