Hathras బాధితురాలి ఇంటి వద్ద వెల్లువెత్తుతున్న నినాదాలు

Hathras బాధితురాలి ఇంటి వద్ద న్యాయం జరగాల్సిందేనంటూ నినాదాలు వెల్లువెత్తాయి. 20ఏళ్ల యువతిని అగ్ర కులస్థులు గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆరోపిస్తూ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ.. షెడ్యూల్ కులానికి చెందిన యువతి పోస్టుమార్టం రిపోర్టును రేప్ కు గురి కాలేదంటూ ఇచ్చింది.
తీవ్రమైన గాయాలతో పాటు.. నాలుక మీద గాటు ఉండటంతో యావత్ దేశమంతా ఆ ఘటనపై షాక్ అయింది. దీనిని 2012లో జరిగిన నిర్భయ ఘటనతో పోల్చారు.
పోలీసులు హ్యాండిల్ చేసిన తీరుకు.. అర్ధరాత్రి 2గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వర్తించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనా ఒత్తిడి పెరిగింది. ఆదివారం ఉదయం బాధితురాలి కుటుంబంలోని వ్యక్తితో పాటు దాదాపు 500మంది కలిసి బీజేపీ లీడర్ రాజ్ వీర్ సింగ్ పెహెల్వాన్ ఇంటి ముందు మూగారు.
దీనికి సంబంధం లేని నలుగురు యువకులను అరెస్ట్ చేశారని.. సరైన న్యాయం చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీ హాస్పిటల్ లో యువతి సెప్టెంబర్ 29న చనిపోవడంతో వారందరిపై హత్యా కేసు నమోదైంది. ఇంకో వైపు వాదనలు మరోలా ఉన్నాయి. యువతి కుటుంబం ఆ నలుగురు యువకులపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. వారందరనీ నార్కో అనాలసిస్ టెస్టుకు పంపాలంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
జాయింట్ మెజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాశ్ మీనా.. మాట్లాడుతూ.. 'బాధితురాలి కుటుంబంపైన ఎలాంటి ఒత్తిడి లేదని.. ఐదుగురు చొప్పున రాజకీయ నాయకులు బాధిత కుటుంబాన్ని కలుస్తున్నారు. దీని గురించి పోలీసులకు తెలియజేశాం' అని చెప్పారు.
శుక్రవారం కూడా అగ్రకులస్థులంతా మరో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. భారీ సమూహాలుగా ఉండకూడదని.. ప్రైవేట్ రెసిడెన్సిలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను బాధితురాలి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించిన రాహుల్ గాంధఈ.. 'ఎటువంటి శక్తి మమ్మల్ని సైలెన్స్ చేయలేదు' అని అన్నారు.
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. సమాజ్ వాదీ పార్టీ డెలిగేషన్ బాధిత కుటుంబాన్ని కలిశారు. దాదాపు 5కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. కంటిన్యూ చేసిన భీమ్ ఆర్మీ చీఫ్ రెండోసారి అడ్డుకునే సరికి హత్రాస్ చేరుకున్నారు.