ఆపదలో ఉన్న వారు 100 నెంబర్‌కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం..అని పోలీసులు చేస్తున్న ప్రచారం..ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆత్మహత్యాయత్నం చేస్తున్న వ్యక్తిని కాపాడారు నగర పోలీసులు. మెరుపువేగంతో వెళ్లి..ప్రాణాలు రక్షించిన కానిస్టేబుళ్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. దిశ హత్య తర్వాత పోలీసుల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.
2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం మధ్యాహ్నం చిలకలగూడ పోలీసులకు 100 నెంబర్‌పై ఫోన్ కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్న పోలీసులు..ఘటనా ప్రదేశానికి బయలుదేరారు. మెరుపువేగంతో అక్కడకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లి చూడగా మహిళ రోదిస్తూ ఉంది. ఏమి జరిగిందో తెలుసుకున్న పోలీసులు కిటికీలో నుంచి చూశారు. అప్పటికే వ్యక్తి ఉరికి వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు. వెంటనే పోలీసులు తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి..ఆ వ్యక్తిని కిందకు దించారు. సపర్యయలు చేశారు. అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిమిసాల వ్యవధిలో స్పందించడంతో నిండు ప్రాణం దక్కింది.
అక్బర్ ఖాన్, మహమూదా బేగం చిలకలగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం తగాదా పడ్డారు. తీవ్ర మనస్థాపానికి గురైన అక్బర్ ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. హాఠాత్ పరిణామానికి గురైన బేగం..కిటికీలో నుంచి చూసింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. వద్దని వేడుకుంది. కానీ అక్బర్ వినలేదు.
వెంటనే బేగం 100 నెంబర్‌కు ఫోన్ చేసింది. సాయం కావాలని కోరింది. కానిస్టేబుళ్లు అక్కడుకు చేరుకుని అక్బర్‌ను రక్షించారు. డీఐ సంజయ్ కుమార్, ఎస్ఐలు భార్యభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. గాంధీ ఆస్పత్రికి అక్బర్‌ను తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కొలుకొంటున్నాడని వైద్యులు వెల్లడించారు. కానిస్టేబుళ్లును పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
Read More : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత