డాక్ట‌ర్‌కు మస్కా: బ్యాంకు లింక్‌పై క్లిక్ చేశాడంతే.. లక్షలు మాయం

మీ ఫోన్ కు రోజుకు ఎన్నో మెసేజ్ లు వస్తుంటాయి. మీరు లక్షలు గెలుచుకున్నారు. లాటరీలో మీ ఫోన్ నంబరుపై గిఫ్ట్ లు గెలుచుకున్నారని ఇలా మరెన్నో మెసేజ్ లు పంపిస్తుంటారు.

  • Published By: sreehari ,Published On : February 11, 2019 / 09:09 AM IST
డాక్ట‌ర్‌కు మస్కా: బ్యాంకు లింక్‌పై క్లిక్ చేశాడంతే.. లక్షలు మాయం

మీ ఫోన్ కు రోజుకు ఎన్నో మెసేజ్ లు వస్తుంటాయి. మీరు లక్షలు గెలుచుకున్నారు. లాటరీలో మీ ఫోన్ నంబరుపై గిఫ్ట్ లు గెలుచుకున్నారని ఇలా మరెన్నో మెసేజ్ లు పంపిస్తుంటారు.

ప్రతిరోజు మీ మొబైల్ నంబర్ కు ఎన్నో మెసేజ్ లు వస్తుంటాయి. మీరు లక్షలు గెలుచుకున్నారు. లాటరీలో మీ ఫోన్ నంబరుపై గిఫ్ట్ లు గెలుచుకున్నారని ఇలా మరెన్నో మెసేజ్ లు పంపిస్తుంటారు. కొంతమంది తెలిసి తెలియక పొరపాటున మెసేజ్ లింక్ లను క్లిక్ చేస్తుంటారు. దీన్నే క్యాష్ చేసుకొని ఘరానా దొంగలు మీకు తెలియకుండానే మీ సొమ్ము కాజేస్తుంటారు. అంతేకాదు.. ఫోన్ చేసి బ్యాంకు అకౌంట్ వివరాలు అడుగుతుంటారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు అప్ గ్రేడ్ చేస్తామని చెప్పి.. OTP వివరాలు చెప్పమని అడుగుతుంటారు.

నిజానికి ఏ బ్యాంకు కూడా తమ కస్టమర్ల అకౌంట్ పాస్ వర్డ్ వివరాలను చెప్పమని అడగదు. సైబర్ నేరగాళ్లు ఏదో రకంగా బ్యాంకు అధికారులుగా చెప్పుకొని అమాయకులను నమ్మించి వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ముంబైలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. బాధితుడు ఓ డాక్టర్. 2018 నవంబర్ 21న ఓ వ్యక్తి బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ అంటూ ఫోన్ చేశాడు. 
 

యాప్.. అప్ గ్రేడ్ చేయాలని చెప్పి..
మీరు వాడే బ్యాంకు యాప్ ను అప్ గ్రేడ్ చేయాలని చెప్పాడు. మీ మొబైల్ కు ఓ మెసేజ్ వస్తుందని, ఆ లింక్ పై క్లిక్ చేయండి చాలు అన్నాడు. అది నమ్మిన బాధిత డాక్టర్ తన మొబైల్ కు వచ్చిన మెసేజ్ లింక్ పై క్లిక్ చేశాడు. ఆ తరువాత మరో ఫోన్ నెంబర్ కు దాన్ని ఫార్వడ్ చేయమన్నాడు. అంతే.. బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ కదా.. అని చెప్పినవన్నీ చేశాడు ఆ డాక్టర్. ఇంకేముంది. వెనువెంటనే.. ఫోన్ నెంబర్ కు ఐదు మెసేజ్ లు వచ్చేశాయి. డాక్టర్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2.9 లక్షలు విత్ డ్రా అయ్యాయి. 

అది చూసిన డాక్టర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఫోన్ చేసిన వ్యక్తికి కాల్ చేయగా అతడు ఎంతమాత్రం స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్.. పోలీసులను ఆశ్రయించాడు. డెబిట్ అయిన సొమ్ము.. బిహార్ కు చెందిన బిపిన్ మెహతో అనే వ్యక్తి అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. పుణెలో మెహతో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  

Also Read : ఈ ఘోరం ఏంటయ్యా : బాలుడిపై ఏడాదిగా మహిళ అత్యాచారం

Also Read : ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!