Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల విలువైన 119.4 కిలోల అల్ప్రాజోలమ్ ను సీజ్ చేశారు.
అదనంగా 87.8 కిలోల ఇన్-ప్రాసెస్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. 3,600 లీటర్ల లిక్విడ్, 311.6 కిలోల సాలిడ్ రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
తయారీకి ఉపయోగించిన పరికరాలను( 2 రియాక్టర్స్, 1 సెంట్రిఫ్యూజ్, 1 డ్రయ్యర్) సీజ్ చేశారు.
మాస్టర్ మైండ్, కెమిస్టులు, ఫైనాన్షియర్లు, కొనుగోలుదారులు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో చాలామందిపై పాత క్రిమినల్ కేసులు (డ్రగ్స్, మర్డర్, సైబర్ క్రైమ్, ఎకనామిక్ ఆఫెన్సెస్) ఉన్నాయి.
జైల్లో ఉండగానే వీరంతా నెట్‌వర్క్ ఏర్పరచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ అల్ప్రాజోలమ్‌ను తెలంగాణకు తరలించి తాటి కల్లులో కలపాలని ప్లాన్ చేశారు.
అవేరేక్స్ ఫార్మాలో డీఆర్‌ఐ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణకు చెందిన 8 మంది ఉద్యోగులు నిషేధిత కెమికల్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
అల్ప్రాజోలం తయారు చేసి అనధికారికంగా సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తెలంగాణలో విక్రయిస్తున్న కల్లులో మత్తు కోసం కలుపుతున్నట్లు ఆధారాలు సేకరించారు. 119 కిలోల ఫినిష్డ్, 87.8 కిలోల అన్ ఫినిష్డ్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.23.88 కోట్ల ఉంటుందని అంచనా వేశారు డీఆర్‌ఐ అధికారులు.
వీటితో పాటు మత్తు పదార్థాలు తయారు చేసేందుకు 3600 లీటర్ల ద్రవ పదార్థాలు, 311.6 లీటర్ల ఘన పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఓమైగాడ్.. బ్రెయిన్ తినేస్తున్న అమీబా.. ఆల్రెడీ 9 ఏళ్ల బాలిక మృతి.. ఏంటీ అమీబా? ఎలా వస్తుంది?