మద్యం మత్తులో అధికారి వీరంగం

తిరుపతి: మద్యం మత్తులో ఓ ఫారెస్ట్ బీట్ అధికారి వీరంగం సృష్టించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం మద్యం సేవించి కపిలతీర్థం వద్ద ఇష్టారాజ్యంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కారు, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చివరికి బాలసుబ్రమణ్యంను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారే ఇలా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.