Kidnap Case: అంబర్ పేట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మంత్రి శ్యామ్ కిడ్నాప్ కేసును ఈస్ట్ జోన్ పోలీసులు చేధించారు. కిడ్నాప్ కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియాకు తెలిపారు. రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పారు. చర్లపల్లి సమీపంలో ఓ కారును గుర్తించామన్నారు. లాంగ్ డ్రైవ్ కార్లు తీసుకొని కిడ్నాప్ చేశారని వెల్లడించారు.
”రియల్ ఎస్టేట్ వ్యాపారి అంబర్ పేట్ డీడీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. A1 మాధవిలతతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య భర్తలు 15 ఏళ్ళు US లో ఉన్నారు. మూడేళ్లుగా భర్త దూరంగా ఉంటున్నాడు. తనను, పిల్లలను చూసుకోవడం లేదని మాధవిలత కిడ్నాప్ ప్లాన్ చేసింది. శ్యామ్ 2 నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడు. ఆ ఆస్తి పంపకాల విషయంలో మెదటి భార్య మాధవిలత తనకు తెలిసిన దుర్గ వినయ్ తో కలిసి కిడ్నాప్ కి ప్లాన్ చేసింది. అక్టోబర్ 29న మంత్రి శ్యామ్ ను తన ఇంటి నుండి కిడ్నాప్ చేశారు.
దుర్గ వినయ్, సాయి మరో ఇద్దరు యువతులు కిడ్నాప్ లో పాల్గొన్నారు. మంత్రి శ్యామ్ ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకొని శ్యామ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేశారు. నలుగురు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటాం. 8 మొబైల్స్, రెండు బైక్స్ సీజ్ చేశాం. చర్లపల్లి నుండి మెదక్ తుప్రాన్ ప్రాంతానికి తీసుకెళ్లారు” అని డీసీపీ బాలస్వామి తెలిపారు.
వ్యాపారి శ్యామ్ అంబర్‌పేట డీడీ కాలనీలో కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య మాధవిలతతో గొడవల కారణంగా అతడు మరో మహిలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అమెరికా వెళ్లి వచ్చిన శ్యామ్ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఇటీవల అతడు ఇంట్లో ఉండగా.. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. శ్యామ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండో భార్య అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కిడ్నాప్ కేసును చేధించారు.