Eg Distg Police Seized 1000 Kg Ganza
Ganja Seized : గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. అక్టోబర్ 7న ఒరిస్సా నుండి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు .
Also Read : Prostitution Racket : వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
ఆదివారం ఒక లారీలో పశువుల దాణా లోడ్ కింద గంజాయిని లోడ్ చేసి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా మరియు ఆ వాహనానికి ముందు రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు. గంజాయి లార్ కి పైలెటింగ్ చేస్తూ సుకుమామిడి గ్రామ శివారున గల అరువ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్‌లోని వారణాశికి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. మోటారు సైకిళ్లపై వచ్చే వారిలో పోలీసు వారిని చూసి ఒక వ్యక్తి పారిపోయాడని, కాగా మిగిలిన ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామని అన్నారు. ఆలారీ నుంచి వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గత నెల రోజులుగా ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎదుట రాత్రి,పగలు కూడా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి తరలించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్న గంజాయి అక్రమ రవాణా దారులు పైలెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని గంజాయి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని తెలిపారు. పైలెటింగ్‌లో భాగంగా వారు మోటార్ సైకిళ్లను మరియు కారులు ఉపయోగిస్తూ పోలీసు వారి కదలికలను ముందుగా గమనిస్తూ గంజాయి వాహనాలను పోలీసుస్టేషన్ల పరిధి నుంచి దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
.