Ex-Maoists Arrest : ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను బెదిరించి.. రూ.50 లక్షలు డిమాండ్ చేసిన మాజీ మావోయిస్టులు అరెస్టు

మాజీ మావోయిస్టుల నుంచి కారు, ఒక పల్సర్ బైక్, రెండు డమ్మీ పిస్టోళ్లు, నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు.

Ex-Maoists Arrest : ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను బెదిరించి.. రూ.50 లక్షలు డిమాండ్ చేసిన మాజీ మావోయిస్టులు అరెస్టు

Ex-Maoists Arrest

Updated On : April 29, 2023 / 10:49 PM IST

Ex-Maoists Arrest : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన మాజీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ సురేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డిని కూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ మాజీ మావోయిస్టులు బెదిరించారని తెలిపారు. కాళేశ్వరం చెక్ పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కారులో అనుమానంగా ఉన్న ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

Chhattisgarh : DRG ఫోర్స్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు ..11 మంది మృతి