Indian Idol Contestant Arrested : ఆటగాడు…పాటగాడు….కేటుగాడు…. గోల్డ్ మెడల్ విజేత అరెస్ట్

తైక్వాండో పోటీల్లో అంతర్జాతీయ స్ధాయిలో రెండు బంగారు పతకాలు సాధించి, ఇండియన్ ఐడల్ లో సింగర్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో  పాటలు, ఆటల  పోటీలు వదిలేసి

Indian Idol Contestant Arrested :  తైక్వాండో పోటీల్లో అంతర్జాతీయ స్ధాయిలో రెండు బంగారు పతకాలు సాధించి, ఇండియన్ ఐడల్ లో సింగర్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో  పాటలు, ఆటల  పోటీలు వదిలేసి దొంగతనాలు చేయటం మొదలెట్టాడు.

సూరజ్ బహుదూర్ (28) తైక్వాండోలో రెండు సార్లు జాతీయ క్రీడల్లో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. 2008 లో జరిగిన రియాలిటీ షో ఇండియన్ ఐడల్ లో పాల్గోని 50 మంది సింగర్స్ తో పోటీ పడ్డాడు.  కానీ ఈజీ మనీ కోసం వక్రమార్గం పట్టాడు.

గతవారం ఢిల్లీలోని మోతీనగర్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ స్కూటర్ పై అనుమానాస్పదంగా  తిరుగుతున్న సూరజ్ ను అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా అది దొంగిలించిన స్కూటర్ గా గుర్తించారు.  ఇంకా తనిఖీ చేయగా అతని వద్ద వద్ద రివాల్వర్ లభించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకని ప్రశ్నించారు. 100 కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లోనూ నిందితుడని తేలటంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
Als0 Read : Constable Cheated Girl : ఎస్.ఐ.కోచింగ్ సెంటర్‌లో స్నేహం…ప్రేమ…. పెళ్లి చేసుకోమని సరికి పరారైన కానిస్టేబుల్
ఉత్తమ్ నగర్ లోని అతని ఇంట్లో సోదాలు చేయగా. 2.5 కేజీలకు పైగా బంగారం, 55 దొంచిలించబడిన సెల్ ఫోన్ లు,ఐదు దొంగిలించబడిన ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో 100 చైన్ స్నాచింగ్ ల్లో పాల్గోన్నట్లు సూరజ్ నేరం ఒప్పుకున్నాడు.

ఇటీవల సబ్జి మండిలోని ఒక నగల  వ్యాపారికి తుపాకి చూపి బెదిరించి అతని వద్దనుంచి 2.5 కిలోల బంగారాన్ని దోచుకున్నాడు. 2014, 2017, 2019 లో చైన్ స్నాచింగ్ కేసుల్లో అరెస్టై జైలు జీవితం గడిపి వచ్చాడు. ప్రతి సారి బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ తిరిగి నేరాలు చేయటం ప్రారంభించాడు.

వివిధ నేరాల్లో సూరజ్, అతని ముఠా సభ్యులు చాలా సార్లు  పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ స్ధానిక ముఠాలతో కలిసి నేరాలు చేయటం ప్రారంభించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పొందిన సూరజ్ తాను ఆటలు, పాటల వల్ల పెద్దగా సంపాదించలేకపోయాననే ఉద్దేశ్యంతో నేరాలు చేస్తున్నట్లు అంగీకరించాడు.

ట్రెండింగ్ వార్తలు