Chennai Man Begging in Airports : ఎయిర్ పోర్టులో హైటెక్ బిచ్చగాడు, ఒంటరి ప్రయాణీకులే టార్గెట్ చేసి డబ్బులు వసూళ్లు..

ఎయిర్ పోర్టుల్లో ఒంటరిగా కనిపించే ప్రయాణీకులే టార్గెట్ రోజుకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు ఓ హైటెక్ బిచ్చగాడు. ఇతని ప్లాన్ వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే..

Beggar Targeting Airport Passengers

Fake Beggar Targeting Airport Passengers : అతనో హైటెక్ బిచ్చగాడు. వయస్సు 27 ఏళ్లు. పేరు విఘ్నేశ్. ఎయిర్ పోర్టుల్లో మాత్రమే బిచ్చమెత్తుకుంటాడు. అదేంటీ ఎయిర్ పోర్టుల్లో కూడా బిచ్చగాళ్లు ఉంటారా? అని అనుమానం వస్తుంది. నిజమే బిచ్చగాళ్లను ఎయిర్ పోర్టుల్లోకి రానివ్వరు. కానీ ఇతనిది హైటెక్ ప్లాన్స్. డొమెస్టిక్ విమానాల్లో ఒంటరిగా ప్రయాణీకులను టార్గెట్ గా ఇతని విమాన ప్రయాణాలు సాగిస్తుంటాడు. అలా ఎనిమిది ఎయిర్ పోర్టుల్లో ఒంటరిగా కనిపించే ప్రయాణీకులతో మాటా మంతీ కలుపుతాడు. కట్టుకథలు చెబుతాడు. జాలిగా మొహం పెడతాడు. దీంతో జాలిపడిన ప్రయాణీకులు ఇతనికి డబ్బులు ఇస్తుంటాడు. అలా రోజుకు రూ.50 నుంచి రూ.60వేలు సంపాదిస్తున్నాడీ హైటెక్ బిచ్చగాడు. ఆ డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. 2021 నుంచి ఇతని కట్టుకథల బాగోతాలు నడిపిస్తున్నాడు. కానీ ఎల్లకాలం మోసాలు సాగవు కదా..బెంగళూరులో అధికారులకు అడ్డంగా దొరికాడు. విఘ్నేశ్ చెన్నైకు చెందినవాడిగా గుర్తించాడు.

అదుపులోకి తీసుకున్న విఘ్నేశ్ ను ప్రశ్నించగా..విస్తుగొలిపే విషయాలు చెప్పుకొచ్చాడీ హైటెక్ బిచ్చగాడు. హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒంటరిగా కనిపించే ప్రయాణీలకు కల్లబొల్లి కబుర్లు చెబుతాడు. తాను ప్రయాణానికి ఇంకా ఐదారుగంటలు సమయం ఉందనగానే ఎయిర్ పోర్టుకు చేరుకుంటాడు. అక్కడ ఒంటరిగా కనిపించే ప్రయాణీకులకుగుర్తించి వారు పక్కన చేరుతాడు. ఏవేవో కష్టాలు ఉన్నాయని కబుర్లు చెబుతాడు.అలా వారు జాలిపడి డబ్బులు ఇస్తుంటారు.అలా రోజుకు రూ.50 నుంచి రూ.60వేలు సంపాదిస్తాడు. ఆ డబ్బులతో చక్కగా విమానాల్లోతిరుగుతు జల్సాలు చేస్తుంటాడు.

G20 Summit: శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్.. ఉగ్ర ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత.. పాకిస్థాన్ ఏం చెప్పిందంటే..

హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులకు తన జాతి కథలు చెబుతు భారీగా డబ్బులు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైకు చెందిన విఘ్నేష్‌ బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. జీతం కూడా బాగానే వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్‌ పర్సు పోగొట్టుకున్నాడు.

విమాన టికెట్‌ తన ఫోన్‌లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడికి తన ఇబ్బంది గురించి చెప్పాడు. దాంతో అతను జాలిపడి రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత విఘ్నేష్ కు కరోనాసమయంలో ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు ఎంతోమందిలాగానే. దీంతో గతంలో తనకు విదేశీయుడు తన కథ విని డబ్బులు ఇచ్చిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. దాన్నే కథలా మార్చి డబ్బులు సంపాదించాలని ఆలోచన వచ్చింది. అంతే హైటెక్ బిచ్చగాడి అవతారం ఎత్తాడు.ఎయిర్ పోర్టుల్లో తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయని ఇలా రకరకాల కథలు చెప్పి డబ్బులు వసూళ్లు మొదలుపెట్టాడు.బాగా వర్కౌట్ అవ్వటంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

Bihar : జైల్లో ఉండే యువకుడికి కోర్టులోనే పెళ్లి .. మూడు ముడులు వేశాక కటకటాల వెనక్కి, మరి పెళ్లెందుకు చేసినట్లు..?!

విఘ్నేశ్ ముందుగానే డొమెస్టిక్‌ విమాన టిక్కెట్ బుక్ చేసుకుంటాడు. ఖరీదైన క్యాజువల్స్‌ ధరించి, చేతిలో లగేజ్‌ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్‌ షెడ్యూల్‌ టైమ్‌కు ఐదారు గంటల ముందే ఎయిర్ పోర్టుకు వస్తాడు. అక్కడ కనిపించే ఒంటరి ప్రయాణీకులతో మాటలు కలిపి కథలు చెబుతాడు.తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని… వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్‌ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవారు.

ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా అదే తీరుతో డబ్బులు వసూళ్లు చేసేవాడు. అలా విఘ్నేష్‌ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. అలా పెట్టుకున్న టార్గెట్ డబ్బులు వసూలు అయ్యాకే ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. తరువాత మళ్లీ షరా మామూలే.. ఈక్రమంలో మే 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్‌ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నేశ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు ఈ హైటెక్ బిచ్చగాడిని.