పరువు హత్య : కూతురి ప్రాణం తీసిన తండ్రి

తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. కూతుర్ని దారుణంగా హత్య చేసిన తండ్రి. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం కొత్తపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకా రెడ్డి కూతురు వైష్ణవి(20) ఒంగోలులోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతోంది. వైష్ణవి తన క్లాస్‌మేట్ సునీల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సునీల్ తక్కువ కులం కావడంతో వైష్ణవి ప్రేమ పెళ్లిని వెంకా రెడ్డి తిరస్కరించాడు. సంతోషంగా తమ కాపురాన్ని సాగిస్తున్న వైష్ణవిని సునీల్ నుంచి దూరం చేయాలని వైష్ణవికి తండ్రి ఎంతో నచ్చజెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి వెంకారెడ్డి, వైష్ణవి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ రోజు రాత్రే వెంకారెడ్డి కుతురని కూడా చుడకుండా గొంతు నులిమి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.