Pratima: భర్త, కుమారుడు ఇంట్లో లేని సమయంలో దారుణ హత్యకు గురైన ప్రభుత్వ అధికారిణి
హత్యకు గురైన ఇంట్లోనే ప్రతిమ ఎనిమిదేళ్లకు పైగా నివసిస్తున్నారు. ఘటన సమయంలో ఆమె కుమారుడు, భర్త తీర్థహళ్లిలో ఉన్నారు. ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు వారి ఇంటికి చేరుకోగా, తన సోదరి శవమై కనిపించింది

Bengaluru: కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ప్రతిమ బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి బెంగళూరులోని సుబ్రహ్మణ్యపొరలోని తన నివాసంలో ప్రతిమ హత్యకు గురైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె కర్ణాటక ప్రభుత్వంలోని మైన్స్ అండ్ జియాలజీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 45 ఏళ్ల మహిళా అధికారిణి ప్రతిమను కార్యాలయం నుంచి తీసుకెళ్లిన డ్రవైన్.. ఆమె ఇంటి వద్ద రాత్రి 8:30 గంటలకు దింపాడని, ఆ తర్వత ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన ఇంట్లోనే ప్రతిమ ఎనిమిదేళ్లకు పైగా నివసిస్తున్నారు. ఘటన సమయంలో ఆమె కుమారుడు, భర్త తీర్థహళ్లిలో ఉన్నారు. ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు వారి ఇంటికి చేరుకోగా, తన సోదరి శవమై కనిపించింది. అంతకుముందు రోజు రాత్రి కూడా ప్రతిమకు సోదరుడు ఫోన్ చేసాడు. కానీ ఫోన్ కాల్ కి ఎటువంటి స్పందన రాలేదు. ఏంటని వెళ్లి చూస్తే.. ఆమె శవమై కనిపించింది. వెంటనే తన సోదరి మృతిపై పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు.