కాలిబూడిదైన అరవై 108 వాహనాలు

  • Published By: chvmurthy ,Published On : May 6, 2019 / 11:30 AM IST
కాలిబూడిదైన అరవై 108 వాహనాలు

Updated On : May 6, 2019 / 11:30 AM IST

హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో  జీవీకే 108 అంబులెన్స్ ల  ప్రధాన  కార్యాలయంలో  సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు కు వచ్చిన వాహానాలే ఉన్నాయి. మంటలను గుర్తించటంలో సిబ్బంది ఆలశ్యం జరగటంతో భారీ ఎత్తున నష్టం జరిగి ఉంటుందని సమాచారం. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  వాహానాల్లో ఉండే వైద్య పరికరాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరగిందా..లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనేది విచారణలో కానీ తేలదు.  మంటలు అదుపులోకి వచ్చాయి. అధికారులు విచారణ చేస్తున్నారు.