బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదం: హోటల్ స్కై బ్లూలో మంటలు, పరుగులు తీసిన కస్టమర్లు
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని స్కై బ్లూ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‌లోని 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని స్కై బ్లూ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‌లోని 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని స్కై బ్లూ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‌లోని 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 3 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు భయాందోళకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. హోటల్‌పై అనధికారికంగా నిర్మించిన పెంట్ హౌస్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలుడే ప్రమాదానికి కారణం అని తెలిసింది.
హోటల్ 3వ అంతస్తులో చెలరేగిన మంటలు అన్ని గదులకు వ్యాపించాయి. మంటలను గమనించిన హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కస్టమర్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హోటల్‌లోని విలువైన ఫర్నీచర్ కాలిబూడిదవడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.