సిద్ధిపేటలో అగ్నిప్రమాదం : భారీగా ఆస్తినష్టం
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజార్ సమీపంలోని మెదరి వెదురు కట్టెల షాప్ కు మంటలు అంటుకున్నాయి.

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజార్ సమీపంలోని మెదరి వెదురు కట్టెల షాప్ కు మంటలు అంటుకున్నాయి.
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. మోడల్ రైతు బజార్ సమీపంలోని మెదరి వెదురు కట్టెల షాప్ కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
రోడ్డు పక్కనే కట్టెల షాప్ ఉన్నందున ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు అదుపులోకి వచ్చాయి. ఒక ఫైరింజన్ తో ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు చల్లి మంటలు పక్కషాపుకు అంటుకోకుండా అడ్డుకున్నారు.
ఆ ప్రాంతమంతా దట్టంగా పొగకమ్ముకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.