Kondapur Fire Incident : హైదరాబాద్ కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా షో రూమ్‌లో మంటలు..

ఒక్కసారిగా షోరూమ్‌ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.

Kondapur Fire Incident : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్ లోని మహీంద్రా షో రూమ్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక్కసారిగా షోరూమ్‌ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. షోరూమ్‌ నుంచి దట్టంగా పొగ వెలువడింది. ఈ అగ్నిప్రమాదంలో షోరూమ్‌లోని 15 కొత్త కార్లు కాలిపోయాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదంతో షో రూమ్ ముందు రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

మహీంద్రా షో రూమ్ పక్కన ఉన్న సహస్రా ఉడిపి గ్రాండ్‌కు హోటల్‌కు మంటలు వ్యాపించాయి. అలర్ట్ అయిన పోలీసులు సెకండ్‌ ప్లోర్‌లో ఉన్న ఓయో రూమ్‌ను ఖాళీ చేయించారు. 6 ఫైర్ ఇంజన్స్ తో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది? లేక మరో కారణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : 3 లక్షలు లంచం ఇచ్చినా కేసు ఎందుకు పెట్టావ్? సీఐతో వ్యక్తి వాగ్వాదం.. ఆడియో వైరల్