ఉన్నావ్ కేసు : ఐదుగురిని చంపేయడానికి అర్హులు – సోదరుడు

  • Published By: madhu ,Published On : December 7, 2019 / 04:33 AM IST
ఉన్నావ్ కేసు : ఐదుగురిని చంపేయడానికి అర్హులు – సోదరుడు

Updated On : December 7, 2019 / 4:33 AM IST

ఉన్నావ్ రేప్ కేసులో నిందితులైన ఐదుగురిని చంపేయడానికి అర్హులని బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. తన డిమాండ్ ఇదేనన్నాడు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలు ఢిల్లీలో సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబర్ 06వ తేదీ రాత్రి చనిపోయింది. ఈ సందర్భంగా సోదరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి తమ మధ్య లేదని విలపించాడు.

ఐదుగురు నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే…ఐదుగురు నిందితులను జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భద్రత నడుమ నిందితులను తరలించారు. 

ఉన్నావ్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్‌లో దిశ ఘటనలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. పోలీసులపైకి దాడికి పాల్పడి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో వారు హతమయ్యారు. దీంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. 
డిసెంబర్ 05వ తేదీ గురువారం ఆమె కోర్టు విచారణ కోసం రాయ్ బరేలీ వెళ్లేందుకు బైస్వారా బీహార్ రైల్వేస్టేషన్‌కు వెళుతోంది. హరిశంకర్ త్రివేది, కిశోర్ శుభమ్, శివమ్, ఉమేష్‌లు అడ్డగించి ఆమెపై దాడి చేశారు.
Read More : గమనిక : పెరిగిన తాజ్ మహల్ వాంటేజ్ పాయింట్ వ్యూ రేట్లు
అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీనికి కారణం…తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె కంప్లయింట్ చేయడమే.న దీంతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో కిలోమీటర్ దూరం పరుగెత్తింది. చివరకు 112 సాయంతో ఆస్పత్రిలో చేరింది. 90శాతానికిపైగా కాలిపోవడంతో అవయవాలు స్పందించకుండా పోయాయన్నారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించినా కాపాడలేకపోయారు. మరి నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి.