Five Killed In Shooting
Five Killed In Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నార్త్ కరోలినాలోని న్యూస్ రివర్ గ్రీన్‌వే సమీపంలో తెల్లజాతీ యువకుడు కాల్పులు జరిపాడు.
దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరణించినవారిలో ఒక పోలీస్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు.
Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి
కాగా, నిందితుడిని ఇంకా పట్టుకోలేదని ప్రస్తుతం అతడు ఓ గ్యారేజీలో దాక్కున్నాడని వెల్లడించారు. పోలీసులు యువకుడిని చుట్టుముట్టారని తెలిపారు.