Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు...

Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

Texas Shooting

Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని ఇద్దరు పోలీసు అధికారులు హతమార్చినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్దేలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Mass shootings: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. ఇద్దరు మృతి, 30మందికి గాయాలు

తన సొంత వాహనంలో స్కూల్ వరకు వచ్చిన దుండగుడు తుపాకీతో స్కూల్ లోకి ప్రవేశించాడని, కాల్పులు జరిపిన సమయంలో దుండగుడు వద్ద రైఫిల్ కూడా ఉండొచ్చని టెక్సాస్ గవర్నర్ తెలిపాడు. దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కాల్పులు సమాచారాన్ని అధ్యక్షుడు జోబైడెన్ కు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాఠశాలలో కాల్పుల కంటే ముందు దుండగుడు తన అమ్మమ్మను కాల్చి చంపాడని పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మే 28వ తేదీ వరకు సంతాప దినాలుగా ప్రకటించారు. కాల్పుల్లో మరణించిన బాధితులకు గౌరవ సూచికంగా వైట్ హౌస్‌పై మే 28వ తేదీ వరకు జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు

2018లో ప్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టెక్సాస్‌లో బఫెలో సూపర్‌మార్కెట్ లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన జరిగి పది రోజులు గడవక ముందే తాజాగా దుండగుడు స్కూల్ లోకి చొరబడి కాల్పులు జరపడం ఆందోళన కలిగిస్తోంది.