Imprisonment: పొలంలో గంజాయి పెంపకం.. ఐదేళ్లు జైలు శిక్ష.. 25వేలు జరిమానా

ఈ కేసులో గురువారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.

Imprisonment: గంజాయి మొక్కలను పెంచినందుకు ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. సంగారెడ్డి మండలం మునిపల్లి గ్రామంలో మన్నెరాములు తన పొలంలో 36 గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.

సమాచారం తెలుసుకున్న సీఐ మధుబాబు అక్కడికి వెళ్లారు. పొలంలోని గంజాయి మొక్కలను పీకేశారు. మన్నెరాములుపై కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2001లో ఈ కేసు నమోదైంది. దూల్ పేట్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ మధుబాబు సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో గురువారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. మన్నెరాములుకు ఐదేళ్ల జైలు శిక్ష, 25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Also Read: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. స్పీకర్‌కు కీలక ఆదేశాలు.. మూడు నెలలు డెడ్‌లైన్..