కదులుతున్న కారులో మంటలు : డ్రైవర్ సజీవదహనం
సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ కారుప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ కారుప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ కారు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పటాన్ చెరు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు మారుతి సెలెరియో కారు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది చేరుకునే సరికే కారు పూర్తిగా దగ్ధమైంది.
సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. కారులో డ్రైవర్ సీటులో కూర్చొన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులో మంటలు చెలరేగిన సమయంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి బయటకు రాలేక మంటల్లోనే దహనమైనట్టు అనుమానిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
మియాపూర్ జేపీ నగర్ కాలనీకి చెందిన గంటా శ్రీదేవి పేరుపై కారు (టీఎస్ 070 4666) రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంటల్లో సజీవదహనమైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.