Cheistha Kochhar : లండన్‌లో ప్రమాదవశాత్తూ భారతీయ విద్యార్థిని మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన ట్రక్కు

Cheistha Kochhar : సెంట్రల్ లండన్‌లో పీహెచ్‌డీ చదువుతున్న 33ఏళ్ల భారతీయ విద్యార్థిని చెయిస్తా కొచ్చర్ మృతిచెందింది. సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Cheistha Kochhar : 33 ఏళ్ల భారతీయ విద్యార్థిని గతవారం సెంట్రల్ లండన్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందింది. ఇంటికి తిరిగి సైకిల్‌పై వెళ్తు సమయంలో ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గతంలో నీతి ఆయోగ్‌లో పనిచేసిన చెయిస్తా కొచ్చర్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతోంది. ది లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్ ప్రకారం.. ఈ ప్రమాదం మార్చి 19న రాత్రి 8.30 గంటలకు (భారత స్థానిక కాలమానం ప్రకారం) జరిగింది.

Read Also : Family Star : ఫ్యాన్స్‌తో విజయ్, మృణాల్ హోలీ సెలబ్రేషన్స్.. డాన్స్ వీడియో వైరల్..

ప్రమాదం జరిగిన తర్వాత ఫారింగ్‌డన్, క్లర్కెన్‌వెల్ పోలీసులు చేరుకున్నారు. చెయిస్తా కొచ్చర్ తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టుగా మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త ప్రశాంత్ చెయిస్తా కన్నా కొంచెం ముందుగా వెళ్తున్నాడు. అయితే, ఆమెను ట్రక్కు ఢీకొట్టగానే రక్షించడానికి పరుగెత్తాడు. అప్పటికే కొచ్చర్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఆమె మరణ వార్తను ఆన్‌లైన్ పోస్ట్‌లో షేర్ చేశారు.

‘చెయిస్తా కొచార్.. లైఫ్ ప్రోగ్రామ్‌లో నాతో కలిసి పనిచేశారు. ఆమె (#LSE)లో బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి వెళ్ళింది. లండన్‌లో సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఓ ట్రక్ ఆమెను ఢీకొట్టడంతో మరణించింది. ఆమె చాలా తెలివైనది. ఎంతో ధైర్యవంతురాలు కూడా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది. కానీ, చాలా త్వరగా మా అందరి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కాంత్ పోస్టులో పేర్కొన్నారు.

తండ్రి ఎస్పీ కొచ్చర్ తీవ్ర భావోద్వేగం :
మరోవైపు.. లండన్‌లోని ఆమె తండ్రి లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ (రిటైర్డ్) కూడా లింక్‌డిన్ వేదికగా స్పందించారు. తన కుమార్తెతో జ్ఞాపకాలను తీవ్ర భావోద్వేగంతో షేర్ చేశారు. ‘నేను ఇప్పటికీ లండన్‌లో నా కుమార్తె చెయిస్తా కొచ్చర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. మార్చి 19న ఆమె పీహెచ్‌డీ చేస్తున్న ఎల్‌ఎస్‌ఈ నుంచి తిరిగి సైకిల్‌పై వెళుతుండగా ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. నా కూతురు మాతో ఇక లేదనే నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ ఆయన తెలిపారు.

గతంలో గురుగ్రామ్‌లో నివసించిన చెయిస్తా కొచ్చర్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసేందుకు గత సెప్టెంబర్‌లో లండన్ వెళ్లింది. అంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో యూనివర్సిటీల్లో ఆమె చదువుకున్నారు. చెయిస్తా కొచ్చార్ లింక్‌డిన్ ప్రొఫైల్ ప్రకారం.. 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేసింది.

Read Also : Bengaluru Water Shortage : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!

ట్రెండింగ్ వార్తలు