Bengaluru Water Shortage : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!

Bengaluru Water Shortage : బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఉండగా.. అనవసరమైన పనులకు నీటిని వృథా చేశారంటూ అక్కడి వాటర్ సప్లయ్ బోర్డు మొత్తం 22 నివాసితుల్లో ఒక్కొ కుటుంబానికి రూ. 5వేలు చొప్పున జరిమానా వసూలు చేసింది.

Bengaluru Water Shortage : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!

22 Bengaluru families penalised with Rs 5,000 each for wasting water_ Report

Bengaluru Water Shortage : బెంగళూరు సిటీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలే ఎండాకాలం.. అందులోనూ నీటి కొరత.. నగరవాసులకు మంచినీళ్లు దొరకడమే కష్టంగా మారింది.. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి వాటర్ సప్లయ్ బోర్డు నీటిని వృథా చేయరాదంటూ నగరవాసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ప్రత్యేకించి హోళీ పండుగ సమయంలో ఎవరూ కూడా నీటిని వృథా చేయరాదని సూచించింది. కానీ, నగరంలోని కొన్ని కుటుంబాలు అధికారుల అదేశాలను ధిక్కరించి నీటిని వృథా చేయడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టింది.

Read Also : Om Bheem Bush IPL : ఐపీఎల్ టీమ్స్‌కి కొత్త పేర్లు పెట్టిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ యూనిట్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..

మొత్తం రూ.1.1 లక్షల జరిమానా వసూలు : 
తీవ్రమైన నీటి కొరత సమయంలో కావేరి నీటిని అనవసర అవసరాలకు వాడుకున్నందుకు నగరంలోని 22 కుటుంబాలకు భారీ జరిమానా విధించింది. ఒక్కొ కుటుంబానికి రూ. 5వేల జరిమానా విధించినట్లు డెక్కన్ హెరాల్డ్ నివేదించింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1 లక్షల జరిమానా వసూలు చేసింది.

ఈ కుటుంబాలు కార్లను శుభ్రపరచడం, తోటపని చేయడం వంటి అనవసరమైన అవసరాలకు మంచినీటిని ఉపయోగిస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్య తీసుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జరిమానాలు వసూలు చేయగా, దక్షిణ ప్రాంతం నుంచి అత్యధికంగా రూ. 80వేలు వసూలు చేసింది.

ఈ నెల ప్రారంభంలో వాటర్ బోర్డు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని పొదుపుగా ఉపయోగించాలని సిఫార్సు చేసింది. నివాసితులు వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించకూడదని సూచించింది. నీటిని వృథా చేసినవారికి ప్రతిసారీ రూ. 500 అదనపు జరిమానా విధించాలని బోర్డు నిర్ణయించింది.

హోలీ వేడుకల్లో నీటి వినియోగంపై నిషేధం :
నగరంలో హోలీ వేడుకల సందర్భంగా పూల్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలకు కావేరి నీరు, బోర్‌వెల్ నీటిని ఉపయోగించడాన్ని వాటర్ బోర్డు నిషేధించింది. నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఎయిరేటర్లను వ్యవస్థాపించడానికి హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది.

బెంగళూరులో నీటి కొరత సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం శుద్ధి చేసిన నీటిని ఆచరణీయ పరిష్కారంగా పరిశీలిస్తోంది. ఈ శుద్ధి చేసిన నీటిని అనవసరమైన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా తాగడానికి ఉపయోగించే కావేరి నీటిపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. నగరంలోని ఎండిపోయిన సరస్సులను శుద్ధి చేసిన మురుగునీటితో నింపడం ద్వారా బెంగళూరు నీటి సరఫరా బోర్డు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఈ చొరవ వేసవి కాలం ప్రారంభానికి ముందు బోర్‌వెల్‌లను మరమ్మత్తులు చేయడం ద్వారా నీటి కొరతను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ‘సిలికాన్ వ్యాలీ’ (2,600 ఎమ్ఎల్‌డీ)ల అవసరానికి వ్యతిరేకంగా రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి (MLD) కొరతను ఎదుర్కొంటుందని సీఎం సిద్ధరామయ్య గతవారమే చెప్పారు. మొత్తం అవసరాలలో 1,470 ఎంఎల్‌డి నీరు కావేరి నది నుంచి వస్తుండగా, 650 ఎంఎల్‌డి బోర్‌వెల్‌ల నుంచి లభిస్తుందని సీఎం తెలిపారు.

Read Also : Taapsee Pannu : తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? ఒలంపిక్ విజేతతో తాప్సీ పెళ్లి..?