Gangster Shot Dead: పోలీసుల కళ్లలో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చేసిన దుండగులు

అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్‌ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

Rajasthan: పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కొంత మంది దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్‌ను విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లల్లో కారం చల్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని జైపూర్ సమీపంలోని టోల్ ప్లాజా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.

Mumbai Court : భార్యతో పాటు ఆమె కుక్కలకు కూడా భరణం ఇవ్వాల్సిందే : కోర్టు కీలక తీర్పు

పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినను జైపూర్ జైలు నుంచి భరత్‌పూర్ కోర్టుకు తీసుకువస్తుండగా, ప్రత్యర్థి గ్రూపునకు చెందిన దుండగులు తొలుత పోలీసుల కళ్లలో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. జైపూర్ ఆగ్రా జాతీయ రహదారిపై ఉన్న అమోలీ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన జరిగిందని, తదుపరి విచారణ జరుపుతున్నామని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు.

Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్

కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్‌ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. 2022 సెప్టెంబర్ 4న క్రిపాల్‌‌ను ప్రత్యర్థులు కాల్చిచంపారు.