Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్

దానికి కారణం మా తాత గారు.. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్ అని అన్నారు.

Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్

Himanshu Rao

Himanshu Rao – Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మనవడు, మంత్రి కేటీఆర్ (KTR) కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ఇవాళ ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని గౌలిదొడ్డి, కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను రూ.కోటి నిధులతో అన్ని వసతులతో నిర్మించి ఇవాళ ప్రారంభించారు. అక్కడే తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

అనంతరం హిమాన్షు మాట్లాడుతూ… ఇదే తన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అని, కాస్త భయంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ తన కుటుంబం ముందు మాట్లాడుతున్నట్టు ఉందని తెలిపారు. దాదాపు ఏడాది నుంచి ఈ స్కూల్ ఎలా ఉందన్న విషయాన్ని దగ్గరి నుంచి పరిశీలించానని చెప్పారు. మొదట ఈ స్కూల్ పరిస్థితి చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని అన్నారు. అమ్మాయిల వాష్ రూమ్స్ ఉన్న చోట పందులు ఉండటం చూశానని, అమ్మాయిల బాధ అర్థం అయ్యిందని తెలిపారు.

” ఈ స్కూల్ దత్తత వెనుక ఒక స్టోరీ ఉంది.. దానికి కారణం మా తాత గారు. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్. కేసీఆర్ తాతయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయి. చదువుకున్న సమాజం వద్ద పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉంటుందని చెప్పారు. అందుకే ఈ రోజు ఈ స్కూల్ కి సహాయం చేశాను. కేసీఆర్ మనవడికి కదా… ఏదైనా నార్మల్ గా చేసే అలవాటు లేదు..

గొప్పగా చేవలన్నదే ఆలోచన. డబ్బులు కలెక్ట్ చేసి పేదలకు ఉపయోగపడేలా నిధులు ఖర్చు చేయాలనుకున్నాం. మా స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా సీఏఎస్ ప్రెసిడెంట్ గా మొదటి రోజు ఈ స్కూల్ కి గోడలు కట్టించాలని అన్నారు. ఆడపిల్లకు సరైన బాత్రూమ్ లేదు. అలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడలేదు.

ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను. అప్పుడే గోడలు కట్టడం కాదు చాలా చేయాలని అనుకున్నాం. 2 పెద్ద ఈవెంట్స్ చేసి రూ.40 లక్షలు కలెక్ట్ చేశాం. తరువాత సీఎస్ఐ ఆర్ ఫండ్స్ కింద మఫుసుధన్ గారు సహాయం చేసారు. మా నాన్న కూడా నా గ్రేడ్ చదువులో తగ్గినా… వంద మందికి సహాయం చేసే అవకాశం ఉంటే చెయ్యాలి అని చెప్పారు. నా కుటుంబం, స్నేహితులు సహకారం వల్లే ఇది సాధ్యమైంది ” అని హిమాన్షు చెప్పారు.

Himanshu Rao: ఇవాళ హిమాన్షు నా కళ్లు తెరిపించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ