Mumbai Court : భార్యతో పాటు ఆమె కుక్కలకు కూడా భరణం ఇవ్వాల్సిందే : కోర్టు కీలక తీర్పు

భార్యాభర్తలు విడిపోతే భర్త భార్యకు భరణం ఇవ్వటం సాధారణమే. కానీ భార్యతో పాటు ఆమె పెంపుడు కుక్కలకు కూడా భవరణం ఇచ్చి తీరాలని కోర్టు ఇచ్చిన కీలక తీర్పు అత్యంత ఆసక్తికరంగా మారింది.

Mumbai Court : భార్యతో పాటు ఆమె కుక్కలకు కూడా భరణం ఇవ్వాల్సిందే : కోర్టు కీలక తీర్పు

Mumbai Court Wife with Allowance for pet dogs

Updated On : July 12, 2023 / 3:38 PM IST

Mumbai Court Wife with Allowance for pet dogs : ముంబైలోని బాంద్రా కోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఓ మహిళ తన భర్తునుంచి భరణం ఇప్పించాలని కోరుతు వేసిన పిటీషన్ పై తీర్పు సందర్బంగా కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇటువంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ బాంద్రా కోర్టు మాత్రం భార్యతోపాటు ఆమె ఉన్న మూడు కుక్కలకు కూడా భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. మనుషులు ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని..అలా వారి యజమానులు (కుటుంబ బంధాలు) మధ్య బంధాలు తెగిపోతే..దాని వల్ల కలిగే మనోవ్యధనుంచి వారు కోలుకోవటానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని ఈ తీర్పు సందర్భంగా కోర్టు అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలోని బాంద్రా కోర్టు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోమల్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్ 20న జారీచేసిన ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి. భార్యతో పాటు ఆమె పెంచుకుంటున్న మూడు కుక్కలకు కూడా భరణం చెల్లించాలని తీర్పునివ్వటం ఆసక్తికరంగా మారింది.

Adani..Ambani : అంబానీ పవర్ ప్లాంట్‌‌ను అదానీ కొనేస్తారా..! ఆ దిశగా యత్నాలు

ప్రస్తుతం 55 ఏళ్లున్న ఓ మహిళకు 1986లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అతను బెంగళూరులో వ్యాపారం చేస్తుంటాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి వివాహాలు జరిగాయి. ఇద్దరు విదేశాల్లో స్థిరపడ్డారు. సంసారంలో భార్యాభర్తల మధ్య కలతలు, కలహాలు సర్వసాధారణమే. వీరిద్దరు జీవితాల్లో కూడా అవి ఉన్నాయి. ఈక్రమంలో భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఆ చిరాకులు ఏర్పాడి భార్యను వేధించటం మొదలుపెట్టాడు. అవి రోజు రోజుకుపెరిగిపోవటంతో ఆమె భరించలేకపోయింది. అలా వారి మధ్య విభేధాలు పెరిగి భర్త ఆమెను బెంగళూరు నుంచి ముంబైకు పంపించేశాడు. ఇక ఇద్దరు కలిసి ఉండటం కుదరదని చెప్పాడు. నువ్వు జీవించటానికి అవసరమైన డబ్బు పంపిస్తానని చెప్పాడు. కానీ అన్నమాట నిలబెట్టుకోలేదు. దీంతో 55 వయస్సులో ఎటువంటి ఉపాధి లేకపోవటం..పైగా తనపై ఆధారపడి ఉన్న పెంపుడు కుక్కల పోషణ కష్టమైపోయింది ఆమెకు.

దీంతో ఆమె భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతు కోర్టును ఆశ్రయిచింది. తనకు ఎటువంటి ఆదాయ మార్గాలు లేవని భర్త ఇచ్చే భరణంతోనే జీవించాలని తనతో పాటు తన పెంపుడు కుక్కలకు కూడా మనోవర్తి ఇప్పించాలని కోరింది. నెలకు రూ.70,000 ఇప్పించాలని కోరింది.తనపై మూడు పెంపుడు కుక్కలు ఆధారపడి జీవిస్తున్నాయని..కాబట్టి తనకు తన కుక్కలకు కూడా భరణం ఇప్పించాలని కోరింది. తన నుంచి విడిపోయిన భర్త బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారని..దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించింది.

Tomatoes As Birthday Gift : ఆమె పుట్టిన రోజుకు టమాటాలు బహుమతి .. కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న ఆమె ఎవరంటే..?

అవన్నీ పరిశీలించిన కోర్టు ఆమెకు ఆమెపెంచుకుంటున్న మూడు కుక్కలకు కూడా భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీంతో సదరు భర్త షాక్ అయ్యాడు. భార్యతో పాటు ఆమె కుక్కలకు కూడా భరణమా? అని ఆశ్చర్యపోయాడు. తనకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అంత మొత్తం ఇచ్చుకోలేనని కోర్టుకు తెలిపాడు. మనోవర్తిని భార్యకైతే చెల్లించాలి కానీ, పెంపుడు కుక్కలకు అవసరం లేదని భర్త వాదించారు. కానీ తన వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లుగా ఆధారాలను కోర్టుకు చూపించలేకపోయారు. దీంతో భర్త వాదనలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో భార్యకు నెలకు రూ.50,000 మనోవర్తి ఇవ్వాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 20న ఉత్తర్వులు జారీ చేశారు.