పారీస్ బేకరీలో భారీ పేలుడు.. రక్తమోడిన వీధులు

సెంట్రల్ పారిస్ లోని ఓ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డజన్లకు పైగా గాయపడినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యంత 9వ రద్దీ ప్రాంతంలో పేలుడు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.

  • Published By: sreehari ,Published On : January 12, 2019 / 09:55 AM IST
పారీస్ బేకరీలో భారీ పేలుడు.. రక్తమోడిన వీధులు

సెంట్రల్ పారిస్ లోని ఓ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డజన్లకు పైగా గాయపడినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యంత 9వ రద్దీ ప్రాంతంలో పేలుడు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.

  • గ్యాస్ పేలి డజన్ల మందికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం

పారిస్: సెంట్రల్ పారిస్ లోని ఓ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డజన్లకు పైగా గాయపడినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యంత 9వ రద్దీ ప్రాంతంలో పేలుడు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి సమీప ప్రాంతాల్లోని భవనాల్లోకి మంటలు వ్యాపించాయి. చారిత్రక కట్టడాలు, కార్లు ధ్వంసమయ్యాయి. బేకరీలోని గ్యాస్ లీక్ కారణంగానే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు పారిస్ పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు విధ్వంసంతో భవనాల్లోకి దట్టమైన పొగ వ్యాపించింది. భవన శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను ఫైర్ సిబ్బంది బయటకు లాగారు.

ఘటన స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రులతో వీధులన్నీ రక్తసిక్తమయ్యాయి. కారు బాంబు పేలడంతోనే ఈ భారీ పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షి ల్యూకే అనే వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. పేలుడు ధాటికి భవనంలోని మూడు నాలుగు బ్లాక్ లోని కిటికిలు పగిలిపోయి బయటకు దూసుకొచ్చినట్టు ల్యూక్ తెలిపాడు. ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.