ప్రేమ పేరుతో మోసం…పోలీసులకు గే ఫిర్యాదు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 03:55 AM IST
ప్రేమ పేరుతో మోసం…పోలీసులకు గే ఫిర్యాదు

Updated On : February 28, 2020 / 3:55 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన ముదాంగుల్ల శ్రీను అలియాస్‌ లక్కీ రాయ్‌ (గే) హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1లో ప్రైవేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2017లో అత్తాపూర్‌కు చెందిన ఎండి ఫెరోజుద్దీన్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఒక రోజు ఫెరోజుద్దీన్‌.. శ్రీనును ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు. 

కొద్ది రోజులకు శ్రీను అతని ప్రేమను అంగీకరించాడు. ఇద్దరు కలిసి తిరిగారు. 2018 జూలై 8న ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. గోవాకు వెళ్లి ముందస్తుగా హనీమూన్‌ చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14న పెండ్లి చేసుకుంటానని ఫెరోజుద్దీన్‌ తెలిపాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులైన ఖలీద్‌, అమర్‌, సల్మాన్‌, వలీమాలను శ్రీనును పరిచయం చేశాడు. గత మార్చిలో ఫెస్‌బుక్‌లో ఫెరోజుద్దీన్‌ ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. 

దీంతో అనుమానం వచ్చి అడుగగా, అది ఫేక్‌ ఫొటో అంటూ దాట వేశాడు. ఈ ఏడాది జనవరిలో  తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్తున్నానని చెప్పిన ఫెరోజుద్దీన్‌ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. 2020, ఫిబ్రవరి 14న ఓ యువతిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫెరోజుద్దీన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


See Also:

కేసీఆర్ పేరుతో మరో పథకం

కేసీఆర్ ఔదార్యం : వృద్ధుడి కోసం ఆగి..సమస్య తెలుసుకుని

ఇదేం లెక్కా.. కేసీఆర్ ఎంత తిడితే అంత సంతోషిస్తున్న బీజేపీ నేతలు