Gelatin Sticks Explosion : ఘోర ప్రమాదం.. వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పేలుడు.. నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు
Gelatin Sticks Explosion : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Gelatin Sticks Explodes In Maharashtra
Gelatin Sticks Explosion : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జెలటిన్ స్టిక్స్‌తో ఉన్న ఓ మెటల్ కంటైనర్ పేలడంతో నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన యవత్మాల్ జిల్లాలోని ఉమర్‌ఖేడ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Mukesh : ఎవరూ లేరని అమ్మాయి ఇంటికి వెళ్లిన ముకేశ్.. వాళ్ళ బ్రదర్ రావడంతో.. బాత్రూంలో పాపం..
బ్లాస్టింగ్ పనులకు ఉపయోగించే ఓ ట్రాక్టర్‌ను మరమ్మతుల కోసం ధనకీ రోడ్డులోని వెల్డింగ్ వర్క్‌షాప్‌కు తీసుకువచ్చారు. ట్రాక్టర్‌కు అనుసంధానించి ఉన్న మెటల్ కంటైనర్‌లో జెలటిన్ స్టిక్స్ ఉన్నాయి. ట్రాక్టర్‌పై వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే ఆ కంటైనర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ట్రాక్టర్ వెనుక టైర్ సమీపంలో ఉన్న ఎయిర్ సిలిండర్ కూడా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో కాలిన గాయాలకు గురైన నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పేలుడు శబ్దంవిన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఉమర్‌ఖేడ్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
జెలటిన్ స్టిక్స్ ఉన్న కంటైనర్‌లో పేలుడు ఎలా సంభవించింది? వెల్డింగ్ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
