Cops Harass Woman : కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన యువతి…పోలీసుల లైంగిక వేధింపులు

రాత్రివేళ కాబోయే భర్తతో కలిసి పార్కుకు వచ్చిన యువతిని పోలీసులు లైంగికంగా వేధించి, ఆమె నుంచి డబ్బు లాక్కున్న దారుణ ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది....

police

Cops Harass Woman : రాత్రివేళ కాబోయే భర్తతో కలిసి పార్కుకు వచ్చిన యువతిని పోలీసులు లైంగికంగా వేధించి, ఆమె నుంచి డబ్బు లాక్కున్న దారుణ ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 16వతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. (Ghaziabad cops harass woman) తనకు కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉప్వాన్ సిటీ ఫారెస్ట్‌ను సందర్శించేందుకు వెళ్లిన 22 ఏళ్ల యువతిని ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి సాధారణ దుస్తుల్లో గంటల తరబడి లైంగికంగా వేధించారు. ఘజియాబాద్ పోలీసుల వాహనంలో వచ్చిన పోలీసులు జంట నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 28వతేదీన కేసు నమోదైంది.

Karnataka Clash : కర్ణాటకలో ఈద్ మిలాద్ సందర్భంగా ఘర్షణ…అయిదుగురికి గాయాలు

పోలీసులు తనకు కాబోయే భర్తను చెప్పుతో కొట్టారని, తన వ్యక్తిగత భాగాలపై అనుచితంగా తాకారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తర్వాత నిందితులైన పోలీసులు కాల్ చేస్తూనే ఉన్నారని,అర్థరాత్రి తన ఇంటికి కూడా వచ్చారని మహిళ తెలిపింది. మహిళ సహాయం కోసం పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేయడంతో, ఢిల్లీ పోలీసులు ఆమె కాల్‌ను ఘజియాబాద్ పోలీసులకు ఫార్వార్డ్ చేయడంతో ఈ సంఘటన బయటపడింది.

Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన

ముగ్గురు నిందితుల్లో కానిస్టేబుల్ రాకేష్ కుమార్, హోంగార్డు దిగంబర్, మరో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. ముగ్గురూ తనను, తనకు కాబోయే భర్తను బంధించి మూడు గంటల పాటు లైంగికంగా వేధించారని బాధిత మహిళ తెలిపింది. తమ నుంచి వెయ్యి రూపాయలు కూడా తీసుకున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమను వదిలివేయాలని కోరుతూ చేతులు జోడించి కాళ్ల మీదపడి ప్రాధేయపడినా వారు చలించలేదని, రాకేశ్ కుమార్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు చెప్పారు. మూడో వ్యక్తి తమను రూ.5.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేశామని, హోంగార్డు అతనిపై దిగంబర్ పై చర్యలు తీసుకోవాలని ఆ విభాగానికి లేఖ పంపామని గజియాబాద్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు