Girl Dies : నారాయణపేట జిల్లాలో లైంగిక దాడికి గురైన యువతి మృతి
నారాయణపేట జిల్లాలో లైంగిక దాడికి గురైన యువతి చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచింది. మద్దూర్ మండలానికి చెందిన దివ్యాంగ యువతిపై..

Girl Dies
Girl Dies : నారాయణపేట జిల్లాలో లైంగిక దాడికి గురైన యువతి చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచింది. మద్దూర్ మండలానికి చెందిన దివ్యాంగ యువతిపై కోయిల్ కొండ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు నిన్న రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన అతడు.. యువతిపై దాడి చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి ఇవాళ చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Delhi Girl Murder : భార్య బంధువుల ఇంటికి-ప్రియురాలు పడక గదికి-హత్య చేసిన ప్రియుడు
ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు, యువతులకే కాదు చిన్న పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఒంటరిగా మహిళ రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. కామాంధులు విరుచుకుపడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి లైంగిక దాడులకు తెగబడుతున్నారు.
మహిళల రక్షణ కోసమే ప్రభుత్వాలు.. నిర్భయ, దిశ లాంటి కఠినచట్టాలు ఎన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. మహిళలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.