Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పలు వ్యభిచార గృహలనుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకీ తీసుకున్నారు.

Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్

narsingi police station

Prostitution :  సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పలు వ్యభిచార గృహలనుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకీ తీసుకున్నారు. వీరిలో 19-25 వయస్సు గల మహిళలు ఉన్నారు.
వీరిలో పరివర్తన తీసుకురావటానికి…. సమాజంలో గౌరవంగా బతికేందుకు వీరిని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా అనాధాశ్రమంలో చేర్పించారు.

గత 20 రోజులుగా వారికి ఉపాధి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే గత రాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ ప్రకారం ఆశ్రమంలోని బాత్ రూం వెంటిలేటర్ ను విరగొట్టి…. ప్రహరీ గోడను దూకి పారిపోయారు.
Also Read : Typhoid Mary Released : మహిళకు మూడేళ్లు క్వారంటైన్‌..! ప్రపంచంలోనే తొలి కేసు..!!
ఉదయం 14 మంది మహిళలు కనిపించక పోవటంతో ఆశ్రమ సిబ్బంది సీసీటీవీ ఫుటేజి పరిశీలించి చూడగా… ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు  నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.