Typhoid Mary Released : మహిళకు మూడేళ్లు క్వారంటైన్‌..! ప్రపంచంలోనే తొలి కేసు..!!

ఓ మహిళ 20 కాదు 200ల రోజులు కూడా కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు క్వారంటైన్ లో ఉంది. కాదు కాదు ఉంచారు. మూడేళ్లు క్వారంటైన్ లో ఉన్న ఈ కేసు ప్రపంచంలోనే తొలికేసుగా నమోదు అయ్యింది.

Typhoid Mary Released : మహిళకు మూడేళ్లు క్వారంటైన్‌..! ప్రపంచంలోనే తొలి కేసు..!!

Typhoid Mary

typhoid mary released from quarantine Feb 19th :ఓ మహిళ 20 కాదు 200ల రోజులు కూడా కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు (1095 రోజులు) క్వారంటైన్ లో ఉంది. కాదు కాదు ఉంచారు. మూడేళ్లు క్వారంటైన్ లో ఉన్న ఈ కేసు ప్రపంచంలోనే తొలికేసు. కోవిడ్ మహమ్మారి వల్ల అనుకుంటున్నారా?కానేకాదు..ఈనాటికి ప్రజలకు సోకుతున్న ‘టైఫాయిడ్‌’ వల్ల ఓ మహిళనను మూడు ఏళ్లపాటు క్వారంటైన్ లో ఉంచారు. అన్ని నెలల పాటు క్వారంటైన్ ఉన్న ఆమెను విడుదల చేసిన రోజు ఈరోజే. అంటే..1910లో ఫిబ్రవరి 19.ఈరోజునే ఆమెను క్వారంటైన్ నుంచి విడుదల చేశారు. టైపాయిడ్ వ్యాప్తి చెందుతుందని ‘మేరీ మలోన్’అనే మహిళను మూడేళ్లు క్వారంటైన్‌లో ఉంచారు. చివరకు 1910లో సరిగ్గా ఇదే రోజున ఆవిడను క్వారంటైన్‌ నుంచి విడుదల చేశారు.

Also read : world first skull surgery : 2,000 ఏళ్ల క్రితమే పుర్రెకు సర్జరీ..

మేరీకి సోకిన టైఫాయిడ్ మరో 50 మందికిపైగా సోకింది. వారిలో ముగ్గురు చనిపోయారు. మేరీ కేసు ప్రపంచంలోనే టైఫాయిడ్‌ వ్యాధి తొలి కేసుగా నమోదు అయ్యింది. మేరీ మల్లోన్ సెప్టెంబర్ 23,1869లో జన్మించారు. నవంబర్ 11,1938లో మరణించారు. ఇన్ని నెలల పాటు టైఫాయిడ్ తో క్వారంటైన్ లో ఉండటం వల్లన మేరీని ‘టైఫాయిడ్ మేరీ’అని పేరొందారు.

ఐర్లాండ్‌లోని కుక్స్ టౌన్ లో 1869 లో జన్మించిన మేరీ మలోన్ కు 15 ఏళ్లున్నప్పుడు అమెరికాకు వలస వచ్చింది. యూఎస్ లోని న్యూయార్క్ లోని మామరోనెక్ లో మేరీ వంట మనిషిగా, పని మనిషిగా పనిచేసింది. 1900 నుంచి 1907 వరకు మేరీ పనిచేసిన ఏడు న్యూయార్క్ కుటుంబాలలో టైఫాయిడ్ అనే వ్యాధి వ్యాపించింది. మొత్త మేరీ తన అత్త ఇంట్లో ఉండేది.అలా వంటమనిషిగా పనిచేయటం ప్రారంభించి సంపన్న కుటుంబాల్లో కుక్ గా మారింది.అమెరికాకు చెందిన డిటెక్టివ్ జార్జ్ సోపర్.. టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి మూలాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించిన విషయాలను 1907 జూన్ 15 న ప్రచురించాడు. మేరీని టైఫాయిడ్ క్యారియర్‌గా సోపర్ అనుమానించారు.

Also read : Hyenas Dinner Spot :7 వేల ఏళ్లనాటి హైనాల డిన్నర్ స్పాట్..గుహనిండా గుట్టల కొద్దీ ఎముకలు

సోపర్ అనుమానించిన తర్వాత మేరీని న్యూయార్క్ ఆరోగ్య శాఖ అరెస్టు చేసింది. ఆమె శాంపిల్స్‌ను పరిశీలించగా.. ఆమె గాల్ బ్లాడర్‌లో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. 1907 మార్చి 19 న మేరీని న్యూయార్క్‌లోని నార్త్‌ బ్రదర్‌ ఐల్యాండ్‌లో ప్రభుత్వం నిర్బంధించింది. అలా ఆమె రెండుసార్లు నిర్బంధించిబడింది. ఆమె నుంచి వారానికి మూడు సార్లు శాంపిల్స్‌ తీసుకుని పరిశీలంచగా.. ఆశ్చర్యకరంగా, మేరీకి టైఫాయిడ్ లక్షణాలు కనిపించలేదు. తనకు తెలియకుండానే టైఫాయిడ్ క్యారియర్‌గా మారడంతో ఆమెను టైఫాయిడ్ మేరీ అని కూడా పిలిచేవారు.

Also read : 900 years old sword : సముద్రంలో స్కూబా డైవర్ కు దొరికిన 900 ఏళ్లనాటి ఖడ్గం

టైఫాయిడ్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఆమెను దాదాపు మూడు సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచి చివరకు విడుదల చేశారు. దాంతో 1915లో న్యూయార్క్‌లోని ఒక మహిళా ఆస్పత్రిలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడ కూడా 25 మంది రోగులకు టైఫాయిడ్ సోకింది. దాంతో ప్రభుత్వం మేరీని మళ్లీ 1915 మార్చి 27 న నార్త్ బ్రదర్ ఐస్‌ల్యాండ్‌లోని దవాఖానలో నిర్బంధించింది. చనిపోవడానికి ఆరేండ్ల ముందు పక్షవాతానికి గురైంది. 1938 నవంబర్ 11న న్యుమోనియాతో క్వారంటైన్ సెంటర్‌లోనే ఆమె తుదిశ్వాస విడిచింది.

కాగా..మేరీ గర్భంలో ఉండగా ఆమె తల్లికి టైఫాయిడ్ సోకింది. అలా ఆమె పుట్టుకతోనే టైఫాయిడ్ తో జన్మించింది. అలా ఆమె ఆ టైఫాయిడ్ వల్లనే మూడేళ్లు క్వారంటైన లో ఉండాల్సి వచ్చింది.

Also read :  Gold Island : బంగారు ఐలాండ్ లో మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువైన నిధి..!