Hyenas Dinner Spot :7 వేల ఏళ్లనాటి హైనాల డిన్నర్ స్పాట్..గుహనిండా గుట్టల కొద్దీ ఎముకలు

ఏడు వేల సంవత్సరాల క్రితం నాటి హైనాల స్థావరాన్ని ఓ గుహలో పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండిపోయి ఉంది.ఎక్కడ చూసినా గుట్టల కొద్దీ ఎముకలు చూసేవారిని భయాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్లనాడు ఈ గుహలో హైనాల ‘డిన్నర్ స్పాట్’గా ఉండేదని భావిస్తున్నారు.

Hyenas Dinner Spot :7 వేల ఏళ్లనాటి హైనాల డిన్నర్ స్పాట్..గుహనిండా గుట్టల కొద్దీ ఎముకలు

Hyenas Dinner Spot Lava Cave Found

Hyenas Dinner Spot in lava cave : తవ్వకాల్లో వందల వేల ఏళ్లనాటి చరిత్రలను పరిశోధకులు వెలికి తీస్తుంటారు. చరిత్రలో కలిసిపోయి భూమి పొరల్లో కప్పడిపోయిన ఎన్నో వింతలను విశేషాలను ప్రపంచం ముందు పెడతారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఈక్రమంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒకటీ రెండూ కాదు ఏకంగా సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని కనుగొన్నారు.ఈ గుహ మొత్తం ఎముకలతో నిండిపోయి ఉంది.ఎక్కడ చూసినా గుట్టల కొద్దీ ఎముకలు చూసేవారిని భయాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్లనాడు ఈ గుహలో హైనాల ‘డిన్నర్ స్పాట్’గా ఉండేదని భావిస్తున్నారు. ఆ గుహలో ఎన్నో రకాల జంతువుల ఎముకలు గుట్టలుగా పడి ఉన్నాయి. దాదాపు గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు వంటి 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి.

అంతేకాదు ఈ ఎముకల్లో మనుషులవి కూడా ఉండటంతో సైంటిస్టులు షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ఎముకల గుట్టల్లో ఇతర హైనాల ఎముకలు కూడా ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఎముకల గుట్టల్లో ఉండే మనుషుల ఎముకలు హైనాలు స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను మాంసం కోసం గుహలోకి లాక్కువచ్చి తినేసి ఉంటాయని అంచనా వేశారు. కాగా..ఈ గుహను శాస్త్రవేత్తలు 2007లో కనుగొన్నారు. గుహ లోపలికి ప్రవేశించటానికి యత్నించారు.అలా కొంచెం లోపలికి వెళ్లగానే లోపలి నుంచి కొన్ని జంతువుల అరుపులు వినిపించాయి. దీంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం మానుకున్నారు. ఆ తరువాత మరోసారి ఇటీవల కాలంలో ఆ గుహలోకి శాస్త్రవేత్తల బృందంగా వెళ్లగా గుహ నిండా ఎక్కడ పడితే అక్కడ ఎముకల గుట్టలు కనిపించాయి.

ఆ ఎముకల నుంచి పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్‌ డేటింగ్‌ టెస్ట్‌ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది. హైనాలు మాంసాన్నే తింటాయి. అడవుల్లో హైనాలు ఇతర జంతువులు వేటాడి వదిలేసిన మాంసాన్ని తింటాయి. అంతే తప్ప సాధారణంగా ఇవి వేటాడవు.పరాన్న జీవులుగా ఉంటాయి. కానీ ఆకలి వేస్తే మాత్రం గుంపులుగా జంతువుల మీద దాడి చేసి చంపి తింటాయి.

ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. ఇతర జంతువులనే కాకుండా వాటిలో అవి కూడా చంపి తింటాయి. ఇలా ఇవి క్రూరత్వం కలిగిన జంతువులని చెప్పాలి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు. కాగా..మనిషిలా నవ్వగలిగే ఒకే ఒక్క జంతువు హైనా. జంతువులు నవ్వవు.కానీ హైనాలు అరిస్తే అచ్చు మనిషి నవ్వినట్లుగానే ఉంటుంది.అందుకే మనిషిలా నవ్వగలిగే జంతువు హైనా అంటారు.