Groom shot at by unidentified men during his wedding procession : పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడు ఓపెన్ టాప్ రధంలో కూర్చుని ఊరేగుతున్నాడు. పెళ్లి వాహనం ముందు … డీజే సౌండ్ లో అందరూ డ్యాన్సులతో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఇంతలో కొందరు దుండగులు వరుడిపై కాల్పులు జరిపారు. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ సమీపంలోని ముండ్కా ప్రాంతంలోని రామన్ (27) వివాహా వేడుక జరుగుతోంది.
పెళ్లి కొడుకైన రామన్ సాంప్రదాయ దుస్తుల్లో ఓపెన్ టాప్ జీపులో ఊరేగుతూ కళ్యాణ మండపానికి వెళుతున్నాడు. డీజే సౌండ్స్ కు లయబద్దంగా బంధువులు డ్యాన్స్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఊరేగింపు పిరాన్ కుడ్నా సమీపంలోకి వచ్చే సరికి గుర్తు తెలియని ఆంగతకులు వరుడు రామ్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామ్ కు బుల్లెట్ గాయాలయ్యాయి.
పెళ్లి వేడుకలో పాల్గోన్నవారు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై కి కూడా కాల్పులు జరిపి, కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన వరుడ రామ్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.